
WhatsApp group admins: వాట్సాప్..(WhatsApp) లేని స్మార్ట్‌ఫోన్ ఉండదంటే.. అతిశయోక్తి కాదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లో పర్సనల్ చాటింగ్, గ్రూప్ చాటింగ్, స్టేటస్‌లతో మునిగి తేలుతుంటారు. ఈ తరుణంలో వాట్సాప్ గ్రూప్‌లో ఇష్టానుసారంగా అసభ్యకర, విద్వేష పూరిత మెసేజ్ చేస్తూ.. గ్రూప్ అడ్మిన్స్ ను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. గతంలో అలాంటి విద్వేష పూరిత పోస్ట్‌లకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లనే బాధ్యులుగా ఉండే వారు. కానీ, ఈ విషయంలో కేరళ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
వాట్సాప్ గ్రూపులలో వచ్చే టు వంటి అసభ్య కరమైన పోస్టులు, మత సామరస్య వీడియోలు, ఇతర ఫోటోలకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు ఎలాంటి సంబంధం ఉండదని.. ఇందులో దోషిగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను చూడలేమని కేరళ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.
వాట్సాప్ గ్రూప్ సభ్యులు ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లయితే, దానికి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యత వహించలేరని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ ఈ తీర్పును వెలువరించారు. చైల్డ్ పోర్నోగ్రఫీని పోస్ట్ చేసిన కేసులో తాజాగా కేరళ హై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. క్రిమినల్ చట్టాల ప్రాథమిక సూత్రం ... మెన్స్ రియా ప్రకారం.. ఏ చర్యనైనా నేరంగా పరిగణించాలంటే.. ఉద్దేశ పూరిత చర్య అయి ఉండాలి. ఉద్దేశం, చర్య రెండూ ఏకీభవించినప్పుడే.. కోర్టు నేరంగా పరిగణిస్తుంది.
కేసు ఏమిటి?
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలో ఓ వ్యక్తి ప్రెండ్స్ అనే పేరిట వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. ఆ వాట్సాప్ గ్రూప్ లో.. తన స్నేహితులతో పాటు.. తనకు తెలిసిన వారిని సభ్యులుగా యాడ్ చేశాడు. ఈ గ్రూప్‌లో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్‌లు ఉంచాడు. అయితే.. ఆ వాట్సాప్ గ్రూప్ లోని ఓ సభ్యుడు మార్చి 2020లో చైల్డ్ ఫోర్న్ వీడియో పెట్టాడు.
దీంతో ఆ గ్రూప్ లోని ఓ సభ్యుడు.. అడ్మిన్ పై ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి(ఎ, బి మరియు డి) మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14 , 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్‌లపై కేసు నమోదు పెట్టాడు. దీంతో ఆ గ్రూప్ అడ్మిన్ కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆ కేసును ఇవాళ కేరళ హై కోర్టు విచారణ చేసింది. వాట్సాప్ గ్రూపులలో వచ్చే టు వంటి అసభ్య కరమైన పోస్టులు, మత సామరస్య వీడియోలు, ఇతర ఫోటోలకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు ఎలాంటి సంబంధం ఉండదని..ఆ కేసును కొట్టివేస్తూ.. తీర్పు ఇచ్చింది కోర్టు.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్, దాని సభ్యుల మధ్య మాస్టర్-సర్వెంట్ లేదా ప్రిన్సిపల్-ఏజెంట్ సంబంధం లేదనీ, గ్రూప్ మెంబర్ పెట్టిన పోస్ట్‌కి అడ్మిన్‌ను బాధ్యులుగా ఉంచడం క్రిమినల్ చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. .