ఉడిపి కుటుంబం హత్య : ఆటోలో వచ్చి.. మహిళ, ఆమె ముగ్గురు కొడుకులను హతమార్చి, బైక్ పై పరార్...

By SumaBala Bukka  |  First Published Nov 14, 2023, 12:53 PM IST

శబ్ధాలు విని గదిలోకి వచ్చిన 12 ఏళ్ల బాలుడిని కూడా దుండగుడు హతమార్చాడు. ప్రవేశించినట్లు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు దుండగులు అతన్ని హత్య చేశారని ఆరోపించారు.


ఉడిపి : కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆదివారం అర్థరాత్రి ఉడిపి జిల్లాలో ఓ తల్లి, ఆమె ముగ్గురు కుమారులను కత్తితో పొడిచి చంపారు. బాధితులు తెల్లవారుజామున వారి ఇంట్లో శవమై కనిపించారు. పోలీసుల ప్రకారం, దుండగులు మొదట తల్లి, ఇద్దరు పెద్ద కుమారులను హతమార్చారు. 12 సంవత్సరాల వయస్సు గల చిన్న కొడుకు శభ్దాలు విని అక్కడికి వచ్చాడు. దీంతో వారు అతడిని కూడా హత్య చేశారు. 

ఈ గందరగోళం విని బయటకు వచ్చిన ఇరుగుపొరుగును దుండగులు బెదిరించారు. ఈ దాడిలో మృతి చెందిన మహిళ  అత్త కూడా కత్తిపోట్లకు గురయ్యింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఉడిపిలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఘటనను ధృవీకరించారు. సోమవారం తెల్లవారుజామున ఉడిపిలోని నేజర్ గ్రామ సమీపంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. హసీనా, ఆమె ముగ్గురు పిల్లలను కత్తితో పొడిచి చంపారు.

Latest Videos

undefined

కుప్పకూలిన టన్నెల్.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఘటనా స్థలానికి చేరుకున్న భారీ డ్రిల్లింగ్ యంత్రాలు

వ్యక్తిగత శత్రుత్వమే హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అయితే దీన్ని నిర్ధారించేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ హత్యలు ఉడిపిలోని నివాసితులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.

ఉడిపిలోని తృప్తి నగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ గొడవ విని, చూసేందుకు బయటకు వచ్చానని పొరుగున ఉన్న బాలిక పోలీసులకు చెప్పింది. అయితే నిందితులు తనను కూడా బెదిరించారని తెలిపింది. హసీనా భర్త విదేశాల్లో ఉన్నాడు. నిందితుడు పావుగంటలోనే హత్యలు చేసి, తాము వచ్చిన ఆటోలోనే పరారయ్యాడు. 

ఆటోస్టాండ్ వరకు తన బైక్ మీద వచ్చిన నిందితుడు.. అక్కడ శ్యామ్ అనే వ్యక్తి ఆటో మాట్లాడుకుని తృఫ్తి నగరకు వచ్చాడు. హత్యలు చేసిన తరువాత శ్యామ్ ఆటోలోనే మళ్ళీ తన బైక్ దగ్గరికి వెళ్లాడు. అక్కడినుంచి బైక్ మీద పరారయ్యాడు. అతడికి 45 యేళ్ల వయసుంటుందని గుర్తించారు. 

మృతదేహాలను హసీనా (46), ఆమె పిల్లలు ఆఫ్ఘన్‌ (23), అయినజ్ (21), 12 ఏళ్ల బాలుడుగా గుర్తించారు. కత్తిపోట్లకు గురైన హసీనా అత్తగారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడలో నలుగురు అక్కడికక్కడే హత్య చేయబడ్డారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ఉడిపి పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ విలేకరులతో చెప్పారు.

click me!