Uttarakhand Tunnel Collapse : ఉత్తరాఖండ్ లోని బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా- దండల్గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి.
Uttarakhand Tunnel Collapse : ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం ఆదివారం కుప్పకూలింది. అయితే అందులో 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో భారీ డయామీటర్ పైపులు, డ్రిల్లింగ్ యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లీమీటర్ల వ్యాసం పైపులతో కూడిన ట్రక్కులు సిల్కీయారాకు రావడం ప్రారంభించాయి. తాజాా భారీ డ్రిల్లింగ్ మిషన్ కూడా చేరుకుంది. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు వీలుగా శిథిలాల మధ్య పెద్ద వ్యాసం కలిగిన ఎంఎస్ పైపులను చొప్పించడానికి ఒక యంత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న 40 మంది కార్మికుల ప్రదేశానికి చేరుకోవడానికి బృందాలు ఇంకా 35 మీటర్ల శిథిలాలను తొలగించాల్సి ఉందని సహాయక బృందాలు తెలిపాయి. కాగా.. సహాయక చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
| Uttarakhand: Rescue operations underway in Silkyara Tunnel located on Uttarkashi-Yamnotri road.
(Video - SDRF) pic.twitter.com/mwcu3yeeJE
తాను స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించానని, సహాయక చర్యలు నిరంతరం పర్యవేక్షిస్తున్నానని సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం హరిద్వార్, డెహ్రాడూన్ నుంచి పెద్ద డయామీటర్ హ్యూమ్ పైపులను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ధామి తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం ధామితో ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉత్తరాఖండ్ సీఎంతో కార్మికుల యోగ సమాచారంపై ఆరా తీశారు.
| Uttarkashi tunnel accident: Trucks loaded with 900 mm diameter pipes reach Silkyara. A platform is being prepared for the auger machine for horizontal drilling to rescue the trapped labourers by inserting large diameter MS pipes in the part of the Silkyara tunnel blocked… pic.twitter.com/KcGcVB2z55
— ANI UP/Uttarakhand (@ANINewsUP)కాగా.. కార్మికులను రక్షించడానికి మరో రోజు పట్టొచ్చని ఉత్తరకాశీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అర్పన్ యదువంశీ సోమవారం తెలిపారు. 60 మీటర్ల శిథిలాల్లో 20 మీటర్లకు పైగా శిథిలాలను తొలగించామని, మంగళవారం రాత్రికి లోపల చిక్కుకున్న 40 మందిని బయటకు తీస్తామని చెప్పారు. వారికి ఆక్సిజన్, ఆహారం, నీరు సహా అన్ని మౌలిక సదుపాయాలను పైపుల ద్వారా కల్పిస్తున్నారు. చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని చెప్పారు.