viral video : బైక్ కు పటాకులు కట్టి ప్రమాదకరమైన స్టంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం

Published : Nov 14, 2023, 12:52 PM IST
 viral video : బైక్ కు పటాకులు కట్టి ప్రమాదకరమైన స్టంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం

సారాంశం

దీపావళి పండగ నేపథ్యంలో ఓ యువకుడు బైక్ కు పటాకులు కట్టి ప్రమాకరమైన స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. 

దీపావళి సందర్భంగా ఓ యువకుడు బైక్ తో సాహసం చేశాడు. బైక్ కు పటాకులు కట్టి అవి పేలుతుంటే ప్రమాకరమైన స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసులకు చేరింది. ఇంకేముంది ఆ యువకుడిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరుచ్చికు చెందిన యువకుడు నవంబర్ 9న బైక్ కు పటాకులు కట్టాడు. వాటిని పేలుస్తూ బైక్ తో స్ట్రంట్స్ వేశాడు. ముందు టైర్ ను గాల్లోకి లేపి, పటాకులు పేలుతుంటే హీరోలా కెమెరాలకు ఫోజులిచ్చాడు. అనంతరం ఆ వీడియోను 'డెవిల్ రైడర్' అనే ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు అతడి ప్రతిభను మెచ్చుకుంటే.. మరి కొందరు అతడు చేసిన ప్రమాదకరమైన స్టంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ ఐడీ ఆధారంగా యువకుడిని గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. 

ఆ యువకుడితో పాటు ఇతర నిందితులపై కూడా ఐపీసీ సెక్షన్ 279 (నిర్లక్ష్యంగా వాహనం నడపడం), 286 (పేలుడు పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం), 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే చర్య) కింద కేసు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు