Udaipur killing : కన్హయ్య లాల్ కుమారులకు ప్ర‌భుత్వం ఉద్యోగం.. రాజ‌స్థాన్ కేబినెట్ నిర్ణ‌యం

Published : Jul 07, 2022, 10:08 AM IST
Udaipur killing : కన్హయ్య లాల్ కుమారులకు ప్ర‌భుత్వం ఉద్యోగం.. రాజ‌స్థాన్ కేబినెట్ నిర్ణ‌యం

సారాంశం

ఉదయ్ పూర్ లో నూపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించినందుకు హత్యకు గురైన కన్హయ్య లాల్ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

తాలిబానీ దాడిలో ఉదయపూర్ లో హ‌త్య‌కు గురైన కన్హయ్య లాల్ తేలి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాజస్థాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని సీఎం త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశారు. ‘‘ కన్హయ్య లాల్ తేలి కుమారులు యష్ తేలి, తరుణ్ తేలిలను ప్రభుత్వ సేవలో నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ అపాయింట్‌మెంట్ రాజస్థాన్ సబార్డినేట్ ఆఫీస్ క్లర్క్ సర్వీస్ (సవరణ) రూల్స్, 2008, 2009 రూల్ 6C కింద అందించబడుతుంది ’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

Coronavirus: భార‌త్ లో క‌రోనా కొత్త వేరియంట్‌ను గుర్తించిన డ‌బ్ల్యూహెచ్‌వో

మరణించిన కన్హయ్య లాల్ కుటుంబానికి జీవనోపాధికి మరే ఇతర ఆధారం లేదని గుర్తించామ‌ని అన్నారు. మృతుడి కుమారుల‌కు ఉద్యోగం క‌ల్పిస్తే వారి జీవితం సాఫీగా సాగిపోతుందని, కుటుంబానికి ఆర్థిక, మానసిక సహాయం అందుతుందని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం అని తెలిపారు. 

గ‌త నెల‌లో ఓ టీవీ చ‌ర్చ‌లో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఇవి దేశమంతా దుమారాన్ని రేపాయి. ప్ర‌పంచ‌లోని అనేక గ‌ల్ప్ దేశాలు కూగా ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించాయి. ఆయా దేశాల్లో ఉంటున్న భార‌త రాయభారుల‌ను పిలిపించుకొని వివ‌ర‌ణ అడిగాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. ఇవి హింసాత్మ‌కంగా మారాయి. దీంతో ఆమెను బీజేపీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. 

కోరిక తీర్చాలంటూ వెంటపడి, నిరాకరించిందని గొంతు కోశాడు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన..

కొంత కాలం త‌రువాత  ఈ ఆందోళ‌న‌లు కొంత చ‌ల్ల‌బ‌డ్డాయి. అయితే ఇటీవ‌ల రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో క‌న్హ‌య్య లాల్ అనే టైల‌ర్ నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దీంతో అత‌డిని ఇద్ద‌రు దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు. షాప్ లోకి క‌ష్ట‌మ‌ర్లలా వెళ్లి అత‌డి త‌ల న‌రికారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కూడా విడుద‌ల చేశారు. ఇస్లాంను అవ‌మానించినందుకు ఇలా చేశామ‌ని అందులో పేర్కొన్నారు.  

విషం తీసుకుని యువ రెజ్లర్ మృతి.. అదే కారణమని అనుమానం

అయితే ఈ ఘ‌ట‌నను దేశం మ‌ర‌వ‌క ముందే మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తిలో మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. వెటర్న‌రీ ఫార్మ‌సిస్టుగా ప‌ని చేసే ఉమేష్ కోల్హే జూన్ 21వ తేదీన హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆయ‌న కూడా అంత‌కు ముందు నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతోనే అత‌డిని చంపేశార‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కన్హయ్య లాల్, ఉమేష్ కొల్హే హత్య కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. తాజాగా నుపూర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తు సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు ప‌లికినందుకు బీహార్ లో ఓ యువ‌కుడిపై 20 మంది దాడి చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?