
విధులు నిర్వహిస్తున్న పోలీసుపై యువకులు దాడికి దిగారు. సిగ్నల్ జంప్ చేశాడని వారిని ఆపడమే ఈ దాడికి కారణమయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలోని కుర్లా ప్రాంతంలో చోటు చేసుకుంది. యువకులు పోలీసుపై దాడికి ఒడిగట్టిన తీరు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లాకు చెవుడా? అజాన్ ప్రార్థన కోసం లౌడ్ స్పీకర్లు ఎందుకు?: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పదం
సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర హొవాలే తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం కుర్లా పశ్చిమ ప్రాంతంలోని ఎల్బీఎస్ రోడ్డులోని కుర్లా డిపో సిగ్నల్ వద్ద రాకేష్ రమేష్ ఠాకూర్ (36) డే డ్యూటీ చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఇద్దరు యువకులు ఓ బైక్ పై వస్తున్నారు. హెల్మెల్ లేకుండా నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ సిగ్నల్ కూడా జంప్ చేశారు. దీనిని కానిస్టేబుల్ గమనించారు.
ఆ బైక్ ను కానిస్టేబుల్ రాకేష్ రమేష్ ఠాకూర్ ఆపారు. ఎందుకంత నిర్లక్ష్యంగా బండి నడుపుతున్నావంటూ మందలించాడు. ఇ-చలాన్ వేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు కానిస్టేబుల్ తో వాదించడం ప్రారంభించారు. తమకు ఫైన్ వేయొద్దని డిమాండ్ చేశారు. కానీ ఠాకూర్ వారి మాటను వినకుండా బైక్ ముందుకు వెళ్లి నెంబర్ ప్లేట్ ను తన వద్ద ఉన్న ఇ-చలాన్ పరికరంలో ఫొటో తీశాడు.
కానిస్టేబుల్ ఫొటో తీయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు యువకులు, అతడిపై దాడి చేయడం ప్రారంభించారు. ఠాకూర్ అక్కడున్న ఆపి ఉంచి బైక్ లపై పడిపోయాడు. అయినా వారు వినకుండా కొందరు స్థానికులతో కలిసి కానిస్టేబుల్ ను నెట్టడం, కొట్టడం ప్రారంభించారు. అయితే ఈ దాడిలో ఠాకూర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
చార్‌ధామ్ యాత్ర: ఇప్పటివరకు 2.50 లక్షల మందికి పైగా భక్తుల నమోదు
తరువాత కానిస్టేబుల్ ఠాకూర్ వెంటనే కుర్లా పోలీసులను సంప్రదించారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా.. ఠాకూర్ పైకి యువకులు దాడికి పాల్పడినప్పుడు అక్కడున్న పలువురు తమ మొబైల్ లో ఈ ఘటనను రికార్డ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ వీడియో ఆధారంగా ఇద్దరు నిందితుల్లో ఒకరిని కుర్ల పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితుడిని మహీం నివాసి ఖలీద్ ఇసాక్ వసీకర్ (53)గా గుర్తించారు. మిగతా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వారే దానిని కాపాడుతామని మాట్లాడుతున్నారు - బీజేపీపై ఖర్గే ఫైర్
ఇద్దరు నిందితులపై పోలీసులు సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి చేయడం), 332 (ప్రభుత్వ ఉద్యోగిని అతని విధుల నుండి నిరోధించడానికి స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ అవమానం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.