
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌లో నుంచి రూ. 1,070 కోట్లను విల్లుపురానికి తీసుకెళ్లడానికి రెండు ట్రక్కులో ఎక్కించారు. ఆ రెండు ట్రక్కులు చెన్నై నుంచి విల్లుపురానికి బయల్దేరాయి. ఒక లారిలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో చెన్నైలోని తాంబరంలో రెండు ట్రక్కులు ఆగాల్సి వచ్చింది. ఈ రెండు లారీలు జాతీయ రహదారిపై వెళ్లుతుండగా 17 మంది పోలీసు అధికారులు ఎస్కార్టింగ్ చేస్తున్నారు.
రూ. 535 కోట్ల నగదును తీసుకెళ్లుతున్న ట్రక్కు రోడ్డుపైనే నిలిచిపోయినట్టు సమాచారం రాగానే చోరంపేట్ పోలీసులు స్పాట్‌కు వచ్చారు. అయినా.. మరింత ప్రొటెక్షన్ కోసం ఇంకొంత మంది పోలీసులను అక్కడికి రప్పించుకున్నారు.
ఈ రెండు లారీలు చెన్నైలోని ఆర్బీఐ ఆఫీసు నుంచి విల్లుపురానికి బయల్దేరాయి. ఆ జిల్లాలోని బ్యాంకుల్లో కరెన్సీని డెలివరీ చేయాల్సి ఉన్నది.
అందులో ఒక ట్రక్కు అకాస్మాత్తుగా ఆగిపోవడంతో తాంబరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్దాకు వాటిని తరలించారు. భద్రతా పరమైన కారణాల వల్ల ఆ పని చేశారు.
Also Read: పెళ్లి కార్యక్రమంలోనే విషం తాగిన నవ దంపతులు.. వరుడు మృతి.. ఎందుకంటే?
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ తాంబరం శ్రీనివాసన్.. స్పాట్‌కు టీమ్‌తో వెళ్లారు. సమస్యతో ఆగిపోయిన ట్రక్కును గుర్తించారు. ఆ ట్రక్కును సిద్దా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ఆ ఇన్‌స్టిట్యూట్ గేట్లు మూసేశారు. ఆ గేటులోనికి ఎంట్రీని కొంతకాలం పాటు నిషేధించారు.
మెకానిక్‌లు కూడా ఆ ట్రక్కును రిపేర్ చేయలేకపోవడంతో ఆ రెండు ట్రక్కులను తిరిగి చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కే పంపించారు.