కరుణానిధికి నివాళులర్పించిన చంద్రబాబు, కేసీఆర్

Published : Aug 08, 2018, 04:26 PM ISTUpdated : Aug 08, 2018, 04:50 PM IST
కరుణానిధికి నివాళులర్పించిన చంద్రబాబు, కేసీఆర్

సారాంశం

డీఎంకె చీఫ్ కరుణానిధి పార్థీవ దేహం వద్ద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు బుధవారం నాడు నివాళులర్పించారు. కరుణానిధి చేసిన సేవలను  వారు కొనియాడారు. 


చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధి పార్థీవ దేహం వద్ద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు బుధవారం నాడు నివాళులర్పించారు. కరుణానిధి చేసిన సేవలను  వారు కొనియాడారు. 

బుధవారం నాడు మధ్యాహ్నం  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో  చెన్నై చేరుకొన్నారు.  కేసీఆర్ వెంట ఆయన కూతురు నిజామాబాద్ ఎ:పీ కవిత కూడ ఉన్నారు.  కరుణానిధి  మృతదేహం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. కరుణానిధి  పార్థీవ దేహం వద్ద పిడికిలి బిగించి కేసీఆర్ శ్రద్దాంజలి ఘటించారు.కరుణానిధి కుటుంబసభ్యులను పరామర్శించారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో  కరుణానిధి పార్తీవ దేహం వద్ద  నివాళులర్పించారు.  దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.  మెరీనా బీచ్ లో  కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకోవడం సరైందికాదన్నారు. కరుణానిధి చేసిన సేవలను ఆయన కొనియాడారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే