33 ఏళ్ల క్రితం కరుణానిధి స్టాలిన్‌కు ఏం చెప్పారంటే

Published : Aug 08, 2018, 04:07 PM IST
33 ఏళ్ల క్రితం కరుణానిధి స్టాలిన్‌కు ఏం చెప్పారంటే

సారాంశం

కరుణానిధి శవపేటికపై  గొప్ప మాటలను చెక్కించారు.  33 ఏళ్ల క్రితం ఎంకె స్టాలిన్‌కు చెప్పిన మాటలను  చెక్కించారు. ఎవరైనా చనిపోతే బతికున్నవారు చనిపోయిన వారి జీవితాన్ని నిత్యం గుర్తు చేసుకొనేలా  జీవనం సాగించాలని  కరుణానిధి  స్టాలిన్ కు చెప్పారు


చెన్నై: కరుణానిధి శవపేటికపై  గొప్ప మాటలను చెక్కించారు.  33 ఏళ్ల క్రితం ఎంకె స్టాలిన్‌కు చెప్పిన మాటలను  చెక్కించారు. ఎవరైనా చనిపోతే బతికున్నవారు చనిపోయిన వారి జీవితాన్ని నిత్యం గుర్తు చేసుకొనేలా  జీవనం సాగించాలని  కరుణానిధి  స్టాలిన్ కు చెప్పారు.  ఈ మాటలనే  కరుణానిధి పార్థీవదేహం ఉంచిన శవపేటికపై రాశారు.

మనం చనిపోయినప్పుడు  ప్రజలు మన సమాధిని చూసి విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకొంటున్నారు.. అనేంతగా పేరు తెచ్చుకోవాలి అంటూ స్టాలిన్‌కు 33 ఏళ్ల క్రిత కరుణానిధి చెప్పారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకొంటున్నాయి.

ఈ వ్యాఖ్యలనే కరుణానిధి పార్థీవదేహం ఉంచిన శవపేటికపై రాయించారు.  ఇటీవల స్టాలిన్ తన తండ్రి కరుణానిధికి రాసిన లేఖలో కూడ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కరుణానిధి పార్థీవ దేహంపై తమిళంలో ఈ మాటలను రాశారు. 


 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే