కేరళ విషు బంపర్ లాటరీలో జాక్‌పాట్: ఇద్దరు తమిళ వాసులకు రూ. 10 కోట్లు

Published : May 31, 2022, 02:44 PM ISTUpdated : May 31, 2022, 02:54 PM IST
 కేరళ విషు బంపర్ లాటరీలో జాక్‌పాట్: ఇద్దరు తమిళ వాసులకు రూ. 10 కోట్లు

సారాంశం

ఇద్దరు తమిళనాడు వాసులకు కేరళలో విషు బంపర్ లాటరీలో రూ. 10 కోట్లు దక్కాయి. విదేశాల నుండి వచ్చే బంధువును రిసీవ్ చేసుకొనేందుకు వెళ్లిన ప్రవీణ్, రమేష్ లు సరదాగా కొనుగోలు చేసిన టికెట్ కు రూ. 10 కోట్లు దక్కాయి.


తిరువనంతపురం: విదేశాల నుండి వచ్చిన తమ బంధువులను తీసుకు వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు సరదాగా కొనుగోలు చేసిన టికెట్లు వారిని కోటీశ్వర్లుగా మార్చాయి..కన్యాకుమారికి చెందిన డాక్టర్ ఎం ప్రదీప్, అతడి బంధువు ఎన్ రమేశ్‌లకు కేరళ విషు బంపర్ లాటరీ విజేతలుగా నిలిచారు.రూ.10 కోట్ల బంపర్ లాటరీ వరించింది.

Tamilnadu కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన Praveen , Ramesh లు కొద్ది రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన తమ బంధువును రిసీవ్ చేసుకోడానికి Kerala లోని Tiruvantapuram ఎయిర్ పోర్టుకు వెళ్లారు.. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఓ ఏజెంట్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. అయితే ఊహించని విధంగా వీరు కొనుగోలు చేసిన టికెట్ కు రూ.10కోట్ల లాటరీ తగిలింది. వాస్తవానికి ఈ టిక్కెట్‌ను తిరువనంతపురంలోని పజవంగడి వద్ద ఉన్న చైతన్య లక్కీ సెంటర్‌లో రంగన్, జసీంత అనే దంపతులు తొలుత కొన్నారు. తర్వాత దీనిని ప్రవీణ్, రమేశ్‌లకు విమానాశ్రయ ప్రాంగణం దగ్గర విక్రయించారు.

ఈ నెల 22న Lottery డ్రా తీశారు. ప్రదీప్, రమేశ్ కొనుగోలు చేసిన HB 727990 టిక్కెట్‌ రూ.10 కోట్లు గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ టిక్కెట్ ఎవరూ కొనుగోలు చేశారనేది వారం రోజుల వరకూ సమాచారం లేదు. వారి గురించి అధికారులు ఆరా తీశారు. అయితే, చివరకు ప్రవీణ్, రమేశ్‌లకు ఈ విషయం తెలియడంతో వాళ్లు సోమవారం లాటరీ భవన్ కు  వెళ్లి టికెట్ తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించారు. లాటరీ రూ.10 కోట్లలో పన్నులు పోగా మిగతా మొత్తాన్ని అందుకున్నారు.

బయట వ్యక్తలు లాటరీ టిక్కెట్లు కొని విజేతలుగా నిలిస్తే వారు తమ రాష్ట్రానికి ఏ పనిమీద వచ్చారో వివరాలను తెలియజేయాలి. ఈ సందర్భంగా తాము విదేశాల నుంచి వచ్చిన బంధువును తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు టిక్కెట్ కొనుగోలు చేసినట్టు విజేతలు వెల్లడించారు. తమ స్వస్థలంలో ఆలయ వేడుకలు కారణంగా జాప్యమైనట్టు తెలిపారు. వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను అధికారులకు సమర్పించారు.

ఈ రూ. 10 కోట్లను ప్రవీణ్, రమేష్ లు ఉమ్మడిగా దావా వేశారు. అయితే ఈ మొత్తాన్ని తీసుకోవాలంటే జాయింట్ గా బ్యాంకు ఖాతాను తెరవాలని కోరారు. ఇతర రాష్ట్రానికి చెందినవారు కావడంతో నోటరీ ధృవీకరణ గుర్తింపును కూడా కేరళ లాటరీ సంస్థ కోరుతుంది.

also read:అనుకోకుండా కొన్న లాటరీ.. అదృష్టం తెచ్చింది.. కొన్న గంటల్లోనే రూ.12 కోట్ల జాక్ పాట్...

ఏజంట్ కు వచ్చే కమీషన్ రూ. 1.20 కోట్లు లాటరీ కార్యాలయం నుండి టికెట్ కొనుగోలు చేసిన వారికే చెందుతాయి. ఏజంట్ సురేష్ కురుప్ దంపతులతో పాటు వారి సబ్ ఏజంట్లుగా ఉన్నట్టుగా సమాచారం. దీంతో పాటు ఆదాయపన్ను శాఖ కింద రూ. 2.64 కోట్ల లాటరీ నుండి మినహాయిస్తారు. ఈ బంపర్ లాటరీలో రూ. 43.86 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
 

 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్