
Mamata Banerjee Funny Video: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో టీఎంసీ అధినేత దీదీ.. తన పార్టీ కార్యకర్తతో జరిగిన సరదా సంభాషణ కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వింటుంటే.. నవ్వుల పువ్వులు పూస్తాయి. రెండు నిమిషాల ఇరవై సెకన్ల వీడియోలో సీఎం మమత కుర్చీపై కూర్చుని ఉండగా.. ఓ పార్టీ కార్యకర్త లేచి నిలబడి ఆమెతో మాట్లాడుతారు. ఈ సందర్భంలో ఆ కార్యకర్తల వర్కౌట్, రొటీన్, ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకుంది.
కార్యకర్తతో దీదీ ఫన్నీ చాలెంజ్
మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తతో కాసేపు సరదాగా ప్రశ్నలు అడిగి కాసేపు అందర్ని నవ్వించారు. మమతా కార్యకర్తతో మాట్లాడుతూ.. “మీ పొట్టను అలా ఎందుకు పెంచుతున్నారు. ఏదో ఒక రోజు అనారోగ్యం బారిన పడుతారు.. అసలు మీరు ఆరోగ్యంగా ఉన్నారా..?” అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆ కార్యకర్త కాస్త సిగ్గుపడుతూ.. తాను 125 కిలోల బరువు ఉన్నప్పటికీ.. తనకు అధిక రక్తపోటు లేదా మధుమేహం లాంటివేమీ రాలేదని, తాను చాలా ఫిట్ గా ఉన్నానని, అలాగే.. తాను రెగ్యూలర్ గా రోజూ 90 నిమిషాలు నడుస్తాననీ, వ్యాయామం చేస్తానని తెలిపారు. కానీ తాను రోజూ ఉదయం పకోడీలు తింటానని అన్నారు.
మరీ ఉదయం పకోడిలు ఎందుకు తింటారని ప్రశ్నించారు దీదీ. తనకు చిన్నప్పటి నుంచి అలవాటనీ, పకోడీలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.అనంతరం దీదీ మరో ప్రశ్న అడిగింది. మీరు ప్రతిరోజూ పకోడీలు ఉంటే మీ పొట్ట ఎప్పటికీ తగ్గదనీ, అలా అయితే నువ్వెప్పటకీ బరువు తగ్గవని బెనర్జీ సూచించారు. ఆ పొట్ట మధ్యప్రదేశ్ లా ఎలా పెరుగుతుందో చూడండి .. అలా అయితే కష్టమేననీ సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అందుకు ఆ కార్యకర్త .. తాను రోజుకు మూడు గంటల పాటు ఎక్సర్‌సైజ్ చేస్తున్నానని, రోజూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తానని చెప్పేసరికి.. ఒక్కసరిగా దీదీ షాక్ అయ్యింది. అయితే ఇప్పటికిప్పుడు ఒక వెయ్యి బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తే నీకు రూ.10వేలు ఇస్తానంటూ సవాల్ విసిరారు. అలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది.
వీడియోపై నెటిజన్ల కామెంట్లు
సీఎం, పార్టీ కార్యకర్త మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ వ్యక్తి బెంగాలీ భాష చాలా మధురంగా ఉంటుందని, మరో వ్యక్తి బహుశా మీకు బెంగాలి తెలిసి ఉంటుందనీ, మరో వ్యక్తి బెంగాలీ భాష కష్టం కాదని, చాలా సులభంగా నేర్చుకోవచ్చని ఇలా విభిన్న కామెంట్లు చేస్తున్నారు.