అమెరికాలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీల మృతి.. మరొకరికి తీవ్ర గాయలు..

Published : Apr 27, 2023, 02:31 PM ISTUpdated : Apr 27, 2023, 02:32 PM IST
అమెరికాలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీల మృతి.. మరొకరికి తీవ్ర గాయలు..

సారాంశం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యవకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 24న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 

అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. కెంటకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ఘోర ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యవకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఏప్రిల్ 24న చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్-ట్రైలర్‌ పైకి దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లిక్ క్రీక్ రోడ్ అన్నా వద్ద జరిగింది.  ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు.

హైదరాబాద్‌కు చెందిన మిన్హాజ్ అక్తర్, ఇల్లినాయిస్‌లోని చికాగోలో నివసిస్తున్నారనీ, ప్రమాదం జరిగిన సమయంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కారులో ఉన్నారని బాధితుడి సోదరుడు హాజ్ అక్తర్ వెల్లడించారు. ప్రమాదంలో మహ్మద్‌ ఫైసల్‌, ఇషాముద్దీన్‌ చనిపోయారనీ, గాయపడిన వారి స్నేహితుడు సయ్యద్ ఫైసల్ చికిత్స తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని అక్తర్ తెలిపారు.

ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో స్థిరపడిన హైదరాబాదీ వ్యక్తి సాయంతో సెయింట్ లూయిస్‌లోని దార్-ఉల్-ఇస్లాం మసీదులో అంత్యక్రియలు (నమాజ్-ఎ-జనాజా) జరిగాయని సామాజిక కార్యకర్త , MBT నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ తెలిపారు. ఏప్రిల్ 25న అంత్యక్రియలు నిర్వహించామని ఆయన తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word