వీడి దుంపతెగ.. 15 నిమిషాలలో ఏటీఎంలను ఎలా పగలగొట్టాలో ట్రైనింగ్.. నిరుద్యోగులకు స్పెషల్ ఆఫర్...

By SumaBala BukkaFirst Published Apr 27, 2023, 12:22 PM IST
Highlights

ఓ బాబా నిరుద్యోగులకు ఏటీఎంలను 15 ని.ల్లో పగలగొట్టి చోరీ చేయడంలో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాడు. ఏటీఎం చోరీ దర్యాప్తులో ఈ నిజం వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్ : లక్నోలో బీహార్ బాబాగా పేరుపొందిన ఓ బాబా..  దొంగతనం చేయడంలో యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీహార్ కి చెందిన ఓ ఏటీఎం బాబా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఈ మేరకు ఉపాధి కల్పిస్తున్నాడు. కేవలం 15 నిమిషాలలో ఏటీఎంలను ఎలా పగలగొట్టాలని అంశం మీద శిక్షణ ఇస్తున్నాడు. వీరితో లక్నోలోని ఏటీఎంలలో దోపిడీలు  చేయిస్తున్నాడు. 

 బీహార్ లోని ఛప్రా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం బాబాగా పేరుపొందాడు. ఇతను కేవలం 15 నిమిషాలలో ఏటీఎంలను ఎలా పగలగొట్టాలో తెలుసుకోండి… అంటూ నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చాడు. ఇది ఇటీవల బయటపడింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఇటీవల ఒక ఏటీఎం చోరీ జరిగింది. దీనిమీద దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను విచారించారు.  ఆ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

Latest Videos

ఆ విచారణలోనే  ‘ఏటీఎం బాబా’గా పిలిచే సుధీర్ మిశ్రా పేరు వెలుగులోకి వచ్చింది. ఈ చోరీలో నిందితులు కేవలం 16 నిమిషాల వ్యవధిలో ఎస్బిఐ ఎటిఎంను పగలగొట్టారు. రూ.39.58 లక్షల రూపాయలను దోచుకున్నారు. దీనిమీద విచారణలో ఈ చోరీని మిశ్రాయే చేయించాడని తేలింది. దీంతో వెంటనే అతని కోసం వలవేసిన పోలీసులు.. మిషన్ తో పాటు అతని సహచరులైన బుల్బుల్ మిశ్రా, మరి కొంతమందిని పట్టుకున్నారు.

ఆటోడ్రైవర్ యూట్యూబ్ ఛానెల్ వైరల్.. పర్సనల్ ఫైనాన్స్ పై పాఠాలు చెబుతూ...

కాగా, అంతకుముందు ఏప్రిల్ మూడవ తేదీన లక్నోలోని సుల్తాన్ పూర్ రోడ్డు ప్రాంతంలో ఏటీఎం చోరీ జరిగింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో నిందితులు ఏటీఎంను పగలగొట్టి విజయవంతంగా దోచుకున్నారు. దీనిమీద క్రైమ్ జాయింట్ పోలీస్ కమిషనర్ నీలాజీ చౌదరి దర్యాప్తు చేశారు. ఇది కూడా సుదీర్ మిశ్రా అతని సన్నిహితుడైన నీరజ్ మిశ్రాతో చేయించాడని తేలింది. 

సుధీర్ మిశ్రా వేసిన ఏటీఎం దోపిడీ పథకంలో అతనికి మరో ముగ్గురు నిందితులు సహకరించారని తేలింది. ఇద్దరు నిందితులైన దేవాష్ పాండే, విజయ్ పాండేలు ఏటీఎం చోరీకి ముందు ఆ ప్రాంతంలో పెడతారు. ఆ తర్వాత తాము అనుకున్న పథకం అమలు చేసేందుకు మరో నలుగురు దొంగలను హర్యానాలోని మేవాత్ నుంచి పిలిపించారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో వివరాలు వెళ్లడయ్యాయి. 

ఇక ఈ ఏటీఎం దోపిడీ జరిగిన సమయంలో.. ఏటీఎం బాబా బీహార్ లో ఉన్నాడు. మిగతా వారితో ఫోన్లో కాంటాక్ట్ లోఉండి సూచనలిస్తూ ఈ దోపిడీకి పాల్పడ్డారని తేలింది. ఇక ఏటీఎంలోకి చొరబడిన తర్వాత వారు తమతో పాటు తీసుకెళ్లిన వస్తువులతో  మిషిన్ ని పగలగొడతారు. దీనికోసం మూడు గ్యాస్ పైపులు, ఒక గ్యాస్ మీటర్,  ఒక సిలిండర్ రెగ్యులేటర్, ఒక పెద్ద క్రోబార్, 6 హాక్సా బ్లేడ్లు, రెండు శ్రావణలు, ఒక సుత్తి వారితో పాటు తీసుకొచ్చుకుంటారు.

ఇక ఏటీఎం సెంటర్లో ఉండే సీసీటీవీ కెమెరాకు చిక్కకుండా ఉండేందుకు దానిమీద నల్ల బట్టను కప్పారు. ఈ దోపిడీ జరుగుతున్న సమయంలో ఏటీఎం బయట ఇద్దరు వ్యక్తులు కాపలా ఉన్నారు. 15 నుంచి 16 నిమిషాల్లోనే నిందితులు ఏటీఎంలో చోరీ చేసి డబ్బుతో పారిపోయారు. 

click me!