ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మిస్సింగ్.. భారీ కూంబింగ్ చేపడుతున్న ఆర్మీ

Published : Oct 16, 2021, 01:53 PM ISTUpdated : Oct 16, 2021, 01:54 PM IST
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మిస్సింగ్.. భారీ కూంబింగ్ చేపడుతున్న ఆర్మీ

సారాంశం

జమ్ము కశ్మీర్‌లో పూంచ్ జిల్లాలోని అడవుల్లో ఎన్‌కౌంటర్ నేటితో ఆరో రోజుకు చేరుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు జవాన్లు ఇప్పటి వరకు మరణించారు. కానీ, ఒక్క ఉగ్రవాది కూడా మరణించిన సమాచారం లేదు. అదీగాకుండా ఇద్దరు జవాన్లు మిస్ అయినట్టు తెలుస్తున్నది. దీంతో ఆర్మీ ఆ అడవిలో భారీగా కూంబింగ్ చేపడుతున్నది.   

శ్రీనగర్: Jammu Kashmirలోని Poonch జిల్లాలో Encounter భీకరంగా జరుగుతున్నది. ఆరు రోజులుగా ఇక్కడ భద్రతా వర్గాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవలి కాలంలో ఇంత దీర్ఘకాలం ఒకే ఎన్‌కౌంటర్ జరగడం ఇదే తొలిసారి. అదీకాకుండా, పూంచ్-రజౌరీ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో Army అధికంగా నష్టపోయింది. సోమవారం ఈ ఏరియాలో ఎన్‌కౌంటర్ మొదలైంది. అప్పటి నుంచి ఒక్క Terrorist కూడా మరణించినట్టు వివరాలు రాలేవు. కానీ, నాలుగు రోజుల క్రితం ఐదుగురు జవాన్లు మరణించారు. గురువారం సాయంత్రం మరో ఇద్దరు అమరులయ్యారు. అంతేకాదు, జూనియర్ కమిషన్డ్ అధికారి సహా ఇద్దరు సోల్జర్లు మిస్ అయ్యారు. దీంతో పూంచ్-రజౌరీ అటవీ ప్రాంతంలో ఆర్మీ భారీగా కూంబింగ్ మొదలుపెట్టింది.

పూంచ్-రజౌరీలో దట్టమైన అడవి ఉన్నది. అక్కడ ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందగానే ఆర్మీ రంగప్రవేశం చేసింది. గాలింపులు మొదలెట్టింది. ఉగ్రవాదులు తారసపడగానే కాల్పులు మొదలయ్యాయి. దట్టమైన అడవిలో ఉగ్రవాదులు తలదాచుకోవడానికి గుహల వంటి నిర్మాణాలు చేసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ, ఆర్మీ మాత్రం జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అడవిలోపలికి వెళ్లాల్సి వస్తున్నది.

Also Read: జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే టాప్ కమాండర్ టెర్రరిస్టు హతం

గురువారం సాయంత్రం ఉగ్రవాదులు విచ్చలవిడిగా భద్రతాలబలగాలపైకి కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో ఓ జేసీవో సహా మరో జవాను మిస్ అయినట్టు ఆర్మీవర్గాలు తెలిపాయి. ఈ అడవిలోనే గురువారం సాయంత్రం ఉగ్రవాదుల కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ యోగాంబర్ సింగ్, రైఫిల్ మ్యాన్ విక్రమ్ సింగ్ నేగిలు నేలకొరిగినట్టు తెలిసింది. ఇదే ప్రాంతంలో నాలుగు రోజులక్రితం ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఇలా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన జవాన్ల మృతదేహాలను వెనక్కి తేవడమూ సవాల్‌గా మారింది. లోతైన ఆ అడవిలోకి వెళ్లి వారిపై పోరాడుతూ అసువులుబాసినవారిని తేవడం కత్తిమీద సాముగా తయారైంది.

గురువారం సాయంత్రమే ఆర్మీ.. ఓ జేసీవో కాంటాక్ట్ లాస్ అయినట్టు ఓ అధికారి తెలిపారు.

Also Read: భద్రతా దళాలకు చిక్కిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్

ఈ ఘటన తర్వాత ఆర్మీ వెలువరించిన ప్రకటన ఇలా ఉన్నది. పూంచ్ జిల్లాలోని నర్ ఖాస్ ఫారెస్ట్ ఏరియాలో ఈ నెల 14న కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్ కొనసాగుతున్నదని, అందులో ఓ సోల్జర్, ఓ జేసీవో తీవ్రంగా గాయపడ్డట్టు తెలిపింది.

నిన్న ప్రకటనలో ఆర్మీ ఇద్దరు జవాన్లు మరణించినట్టు ధ్రువీకరించింది. కానీ, గాయపడ్డ జేసీవోపై వివరాలు వెల్లడించలేదు. జేసీవో కోసం గాలింపులు రాత్రిపూట చేపట్టలేకపోతున్నామని, ఉదయమే మళ్లీ మొదలుపెడతామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఉగ్రవాదులను మరింత లోపటికే తరమడానికి ఈ రోజు ఉదయం భద్రతా బలగాలు దీటుగా దాడి చేస్తూ ముందుకు వెళ్లాయి.

ఒకే ఆపరేషన్‌లో ఇంతమంది జవాన్లను ఆర్మీ కోల్పోవడం ఇటీవలి సంవత్సరాల్లో ఇదే తొలిసారి. కాగా, ఎన్‌కౌంటర్‌ నేటితో ఆరో రోజులోకి చేరుతున్నప్పటికీ ఒక్క ఉగ్రవాది కూడా మరణించిన సమాచారం రాలేదు. భద్రతా సమస్యల కారణంగా పూంచ్ జమ్ము హైవేను అధికారులు మూసేశారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu