CWC Meet : అసమ్మతులపై సోనియా గాంధీ ఆగ్రహం

By AN TeluguFirst Published Oct 16, 2021, 12:20 PM IST
Highlights

పార్టీలో అసమ్మతి మీద ఆమె సోనియా గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జి-23 పేరుతో మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన పని లేదని... నేరుగా అభిప్రాయాలు చెప్పవచ్చని చురకలంటించారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాల్ని కొంతమంది మీడియాకు లీక్ చేయడాన్ని వ్యతిరేకించారు.

న్యూఢిల్లీ : శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసున్నాయి. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ.. "తాను పూర్తి స్థాయి కాంగ్రెస్ అధ్యక్షురాలినేనని, పార్టీ తమ చేతుల్లోనే ఉంది" అనే విషయాన్ని నొక్కిచెప్పారు. 'G-23' అంటూ పార్టీలో చెలరేగుతున్న అసమ్మతులు, విమర్శలకు ఆమె ఇలా చెక్ పెట్టారు. వీరు గత సంవత్సరకాలంగా పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకత్వం కావాలంటూ.. దానికోసం ఎన్నిక నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే Congress Working Committee నేడు సమావేశం అయ్యింది. 

రెండు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి  రాజీనామా చేసినప్పటి నుండి sonia gandhi పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె మాట్లాడుతూ "నేను ఎప్పుడూ ఫ్రాంక్‌నెస్‌ని ప్రశంసిస్తూనే ఉన్నాను", దీనికోసం "మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు" అని 'G -23' విడుదల అయిన లేఖలో రెండు శిబిరాలలోని నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీయడాన్ని ఆమె తప్పుపట్టారు.

ఎలాంటి సమస్యల మీదైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేను సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సీరియస్ అయ్యారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలిని నేనే అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రైతుల నిరసనలు, మహమ్మారి సమయంలో సాయం అందించడం, కోవిడ్ ఉపశమనం వంటి జాతీయ సమస్యలపై చర్చించారు. మైనార్టీలపై టెర్రరిస్టుల హత్యాఖాండపై ఖండించాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్ తో సహా కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి వ్యూహం పాటించాలని ఈ CWC మీటింగులో చర్చించనున్నారు. 

పార్టీలో అసమ్మతి మీద ఆమె సోనియా గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జి-23 పేరుతో మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన పని లేదని... నేరుగా అభిప్రాయాలు చెప్పవచ్చని చురకలంటించారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాల్ని కొంతమంది మీడియాకు లీక్ చేయడాన్ని వ్యతిరేకించారు.

అంతేకాదు, పార్టీ అధిష్టానం ఈ అలజడి సద్దుమణగాలని కోరుకుంటోంది. దీనికోసం ఈ సమావేశంలో తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం కూడా ఈ సమావేశంలో ఉంటుంది.

నేడు కాంగ్రెస్ కీలకభేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం...

అంతర్గత ఎన్నికలకు సంబంధించి, సోనియా గాంధీ "మొత్తం సంస్థ పునరుజ్జీవనం కోరుకుంటున్నారు ... కానీ దీనికి ఐక్యత, పార్టీ ప్రయోజనాలను పారామౌంట్‌గా ఉంచడం అవసరం" అని అంగీకరించారు. "అన్నింటికీ మించి, దీనికి స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరం. 2019 లో ఈ హోదాలో తిరిగి రావాలని CWC నన్ను కోరినప్పటి నుండి నేను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నాను అనే విషయం నాకు బాగా తెలుసు" అని ఆమె అన్నారు. మహమ్మారి రాకముందే ఈ ఏడాది జూన్‌లో ఈ మీటింగ్ షెడ్యూల్ చేయబడింది.

"దీనిమీద మళ్లీ ఒకసారి స్పష్టత తీసుకురావాల్సిన సందర్భం ఇది. పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) (కేకే) వేణుగోపాల్ మొత్తం ప్రక్రియ గురించి తర్వాత మీకు తెలియజేస్తారు" అని ఆమె చెప్పారు.

click me!