హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్: నిర్ధారించిన అధికారులు

By Siva Kodati  |  First Published Mar 2, 2020, 2:56 PM IST

కోవిడ్-19 (కరోనా వైరస్) దీని పేరు చెబితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. చైనాలో బయటపడిన ఈ మహమ్మారి ప్రస్తుతం 54 దేశాలకు విస్తరించి వేల మందిని బలి తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 


కోవిడ్-19 (కరోనా వైరస్) దీని పేరు చెబితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. చైనాలో బయటపడిన ఈ మహమ్మారి ప్రస్తుతం 54 దేశాలకు విస్తరించి వేల మందిని బలి తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

Also Read:కరోనాకు కుబేరులూ ‘డింగ్’య్యారు: రూ.32 లక్షల కోట్లు లాస్

Latest Videos

undefined

అటు భారత ప్రభుత్వం కూడా అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే బయటకు వదులుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.

Also Read:టెక్నాలజీ దిగ్గజాలపై కరోనా ‘పడగ’: ఉద్యోగుల ప్రయాణంపై ఆంక్షలు

ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి. మరో కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా జాడ కనిపించింది. ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పరిస్ధితిని సమీక్షిస్తోంది. 

కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలోతెలంగాణ సర్కార్ అప్రమత్తమయ్యింది. మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

ఎయిర్‌పోర్టులు, హార్బర్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉన్నామని హర్షవర్థన్ వెల్లడించారు. ఇప్పటి వరకు భారతదేశంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రజలు ఇరాన్ పర్యటనలు రద్దు చేసుకుంటే మంచిదని కేంద్ర మంత్రి సూచించారు. 

 

 

click me!