నిర్భయ దోషులకు షాక్: స్టేకు ఢిల్లీ కోర్టు నిరాకరణ, రేపే ఉరిశిక్షకు ఛాన్స్?

Published : Mar 02, 2020, 01:40 PM ISTUpdated : Mar 02, 2020, 01:51 PM IST
నిర్భయ దోషులకు షాక్: స్టేకు ఢిల్లీ కోర్టు నిరాకరణ, రేపే ఉరిశిక్షకు ఛాన్స్?

సారాంశం

నిర్భయ కేసులో దోషులు దాఖలు చేసిన  పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల కోర్టు స్టే  నిరాకరించింది. స్టే ఇవ్వాలని  నిర్భయ దోషుల తరపున అక్షయ్ కుమార్  పిటిషన్ దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులు దాఖలు చేసిన  పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల కోర్టు స్టే  నిరాకరించింది. స్టే ఇవ్వాలని  నిర్భయ దోషుల తరపున అక్షయ్ కుమార్  పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో దోషిగా ఉన్న పవన్ గుప్తా తనకు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదీగా మార్చాలని కోరుతూ  క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం నాడు  సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.క్యురేటివ్ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు.

Also read:నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

మరో వైపు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని దోషుల తరపున అక్షయ్ కుమార్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా  ఉరిశిక్షకు గురైన దోషులకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్న సమయంలో వారిని ఉరితీయకూడదని చెబుతున్నాయి.అయితే ఎవరి పిటిషన్లు పెండింగ్ లో ఉంటే  వారిని ఉరితీయడం నుండి మినహాయించి ఇతరులను ఉరి తీయాలని ప్రభుత్వాలు కోర్టులను కోరాయి. 

నిర్భయ కేసులోని నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు ఇటీవల డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ ఇద్దరు దోషులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే

అక్షయ్ సింగ్, పవన్ గుప్తా స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. తాను తాజాగా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నానని, అది పెండింగులో ఉందని అక్షయ్ సింగ్ తన తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశాడు. ఇంతకు ముందు రాష్ట్రపతి తిరస్కరించిన మెర్సీ పిటిషన్ లో పూర్తి వాస్తవాలు లేవని అక్షయ్ సింగ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు.  ఈ పిటిషన్‌పై ఇవాళ పాటియాల కోర్టు తీర్పును వెల్లడించింది. 

నలుగురు దోషులను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే   పాటియాల కోర్టు తీర్పు మేరకు రేపు  ఉరిశిక్షపై అధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)లకు ఉరిశిక్ష విధించాలని డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu