యూపీలో ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు.. ఘటన స్థలంలో కొనసాగుతున్న ట్రాక్ క్లియరెన్స్ పనులు..

Published : Feb 16, 2023, 10:45 AM IST
యూపీలో ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు.. ఘటన స్థలంలో కొనసాగుతున్న ట్రాక్ క్లియరెన్స్ పనులు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు గూడ్స్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో వ్యాగన్లు పట్టాలు తప్పాయి. కొన్ని పట్టాలపైన, మరికొన్ని పట్టాల పక్కన  పడిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు రైళ్ల డ్రైవర్స్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత లక్నో-వారణాసి, అయోధ్య-ప్రయాగ్‌రాజ్ రైల్వే ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

ప్రస్తుతం  ఘటన స్థలంలో పట్టాలపై నుంచి వ్యాగన్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. రైల్వే ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను క్లియర్ చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్ల ఇంజన్లు దెబ్బతిన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం