
చెన్నై : వారంతా స్నేహితుడు Wedding reception లో సంతోషంగా గడిపారు మద్యం సేవిస్తూ మరింతగా సంబరం చేసుకునే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... Thoothukudi మూడవమైలు పశుంపొన్ నగర్ కు చెందిన కే మారిముత్తు (20), తిరువీకనగర్ కు చెందిన ఎస్.మారిముత్త ను (23), తిరునెల్వేలి జిల్లా పనకుడికి చెందిన ఎస్. జెపసింగ్ (23) స్నేహితులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈనెల 9వ తేదీ గురువారం నాడు తన స్నేహితుడువివాహ రిసెప్షన్ కు హాజరై రాత్రి 10 గంటలకు తూత్తుకుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు పట్టాలపై కూర్చుని మద్యం తాగారు.మత్తు ఎక్కువ కావడంతో ఒళ్లు తెలియని స్థితిలో పట్టాలపై తల పెట్టికుని పడుకుండి పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తూత్తుకూడి కొత్త హార్బర్ లో లోడు ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్ బయలుదేరిన గూడ్స్ రైలు.. పట్టాలపై తల పెట్టుకుని నిద్రిస్తున్న యువకులపై నుంచి వెళ్ళింది. దీంతో ఎస్.మారిముత్తు, కె.మారిముత్తు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలకు జపసింగ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డేటింగ్ యాప్ లో పరిచయమై, హోటల్ కి పిలిచి, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మహిళపై అత్యాచారం...
కాగా, జూన్ 9న మద్యం మత్తులో కన్న కొడుకునే murder చేశాడో కన్నతండ్రి. ఈ ఘటన ఆత్మకూరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరులోని vengalareddy nagarలో పని చేసుకుని జీవించే తండ్రీకొడుకులు హసన్ పీరా (70), మౌలాలి (25)మద్యానికి బానిసలై తరచూ గొడవ పడేవారు. బుధవారం మధ్యాహ్నం మౌలాలి నిద్రిస్తుండగా liquor తాగి వచ్చిన తండ్రి హసన్ పీరా మౌలాలిపై కత్తి పీటతో attack చేశాడు.
దీంతో గొంతు తెగి... తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మౌలాలిని స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా మౌలాలిని కర్నూలుకు తీసుకువెడుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు డిఎస్పి శృతి, సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హసన్ పీరా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
మే 27న విశాఖపట్నంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యంమత్తులో స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరకు ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్ లో చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన రెబాక సాయితేజ (25) మద్యం మత్తులో మరో స్నేహితుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అందరూ కలిసి సాయితేజపై రాడ్లు, కత్తులతో దాడిచేయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. యువకుడి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిసి కెమెరా ఫుటేజి ఆదారంగా నిందితులను గుర్తిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఈ హత్య దారితీసి వుంటుందని అనుమానిస్తున్నారు.