President Election: ఆస‌క్తిక‌రంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక.. బీజేపీ, కాంగ్రెస్ ల వ్యూహాలు..గులాబీ బాస్ పాత్రేంటీ?

Published : Jun 11, 2022, 10:15 AM IST
 President Election: ఆస‌క్తిక‌రంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక.. బీజేపీ, కాంగ్రెస్ ల వ్యూహాలు..గులాబీ బాస్ పాత్రేంటీ?

సారాంశం

President Election: భారత రాష్ట్రపతి ఎన్నికల న‌గారా మోగ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ బలాలపై చర్చ సాగుతోంది.ఏ పార్టీకి ఎంత బలం ఉంది.. ఏ పార్టీ అభ్య‌ర్థి రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోనున్నారు. ఇటీవల కాలంలో దేశ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టినా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాత్రేంటీ అనేది చ‌ర్చ‌నీయంగా మారింది.   

President Election: భార‌త రాష్ట్రపతి ఎన్నికల‌కు నగారా మోగింది. దీంతో మ‌రో సారి దేశ రాజ‌కీయాలు హీటెక్కాయి. అస‌లూ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ బలాబలాగాలేంటీ?  ఏ పార్టీకి ఎంత బలం ఉంది.. ఏ పార్టీ అభ్య‌ర్థి రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోనున్నారనేది  చ‌ర్చ‌నీయంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టి..ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి.. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో చర్చలు జ‌రిపిన   గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాత్రేంటీ? ఆయ‌నకు ఈ ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కూ ప్రాధాన్య‌త ఉంటుంది? ఆయ‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను శాసించ‌గ‌లదా? ఆయ‌న చ‌ర్చ‌లు ఎలాంటి ఫ‌లితాల‌ను ఇవ్వ‌బోతున్న‌య‌నేది చ‌ర్చ‌నీయంగా మారింది. 

హీటెక్కిన రాజకీయాలు 

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ .. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకంగ చేయాల‌ని భావిస్తుంది.  ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో కీల‌క భేటీ అవుతోంది. దీంతో కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో అంత ప్రాధాన్యమేమీ ఉండ‌బోద‌ని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నేప‌థ్యంలో కాంగ్రెస్ అధినేత్రి కీల‌క భేటీల‌ను నిర్వ‌హిస్తోంది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల చ‌ద‌రంగంలో అదును చూసి.. మ‌రీ పావులు క‌దుపుతోంది. ఈ ఎన్నిక‌ల ర‌ణరంగంలో ఆమె తొలి అడుగుగా..  విప‌క్షాల పార్టీల నుండి ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌క్రియ‌కు ఆమెనే ఆమెనే ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. 

ఇప్ప‌టికే ప‌లువురు పార్టీని సీనియ‌ర్ నేత‌ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆమె సూచనలతో పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చలు జరిపారు. మ‌రోవైపు.. సోనియా స్వయంగా బెంగాల్‌, మహారాష్ట్ర సీఎంలతో చ‌ర్చించారని తెలుస్తోంది. త్వరలో వామపక్ష నాయకులతో పాటు డీఎంకే, తృణమూల్‌ నేతలను కలుస్తానని మ‌ల్లికార్ఖున‌ ఖర్గే తెలిపారు. 

అయితే.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ చొరవ ఎవ‌రూ కోర‌లేద‌ని, ఆయ‌న‌నే స్వయం జాతీయ నేతగా వ్యవహరిస్తూ.. అనవసర హడావిడి సృష్టిస్తున్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు అన్నారు. గ‌త నెల‌లో కేసీఆర్ రెండు సార్లు హాస్తీనాకు వెళ్లారు. పంజాబ్ నేత‌ల‌తో, కర్ణాటకలో జనతాదళ్‌-ఎస్‌ నేత, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. అయితే.. ఈ పర్యటన అంతా పెద్ద ఫలితం ఇవ్వ‌లేదనే  రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర‌ప‌తి  నేత‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ .. దేవెగౌడ సహా పలువురు నేతలతో చర్చించే బాధ్యతను సోనియా... ఖర్గేకు అప్పగించారు. ఖ‌ర్గే.. దేవెగౌడకు అత్యంత స‌న్నిహితుడు. బీజేపీయేతర పార్టీలను ఒక తాటి మీదికి తీసుక‌వ‌చ్చి.. ప్రతిపక్షాలు కూట‌మి నుంచి బీజేపీ అభ్యర్థికి ప్రత్యామ్నాయ అభ్యర్థిని నిర్ణయించాలని, ఇందుకు ప్రధాన సంధానకర్తగా కాంగ్రెస్సే వ్యవహరిస్తుందని ఢిల్లీ రాజ‌కీయాల్లో టాక్. 

బీజేపీ ప్లానేంటీ ? 

రాష్ట్రపతి ఎన్నికలో ప్ర‌తిప‌క్ష కూటమి నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ భావిస్తుంటే.. ఈ సారి కూడా  ఎన్డీయే అభ్య‌ర్థినే రాష్ట్ర‌ప‌తి పీఠంపై కూర్చోబెట్టాల‌ని బీజేపీ వ్యూహ ర‌చ‌న చేస్తుంది. ఎన్డీయే అభ్యర్థి భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్నిక అవడం దాదాపు ఖాయం. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే ఆధిపత్యం నెగ్గ‌డానికి, ఆ మేజిక్ మార్కుకు 1.2 శాతం ఓట్ల దూరంలో వుంది. ఎన్డీయే మిత్రకూట‌మి అయినా.. అన్నాడిఎంకే, తటస్థ పార్టీలైన ఏపీలోని వైసీపీ, బీజూ జనతాదళ్మద్దతు ఇస్తాయన్న బీజేపీ దీమా ఉంది. ఈ ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలు ఏఐఏడిఎంకే, వైసీపీ, బీజేడీలతో చ‌ర్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ఛత్తీ్‌సగఢ్‌ గవర్నర్‌ అనసూయా యూకీపేర్లు ప్రధానంగా చర్చల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ఛత్తీస్ గఢ్ గవర్నర్‌ అనసూయా యూకీ ల్లో ఒక్క‌రిని  రాష్ట్ర‌ప‌తి రేసులోకి తీసుకువచ్చేందుకు కమలం నేతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

గ‌తంలో ద‌ళిత నేత‌కు ప్రాధాన్య‌త ఇచ్చినా.. ఎన్డీయే ఈ సారి గిరిజన నేతను ప్రెసిడెంటు రేసులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క‌థ‌నాలు వాస్త‌మైతే..  ఒడిశా గిరిజన నేత, మాజీ మంత్రి, మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, అనుసూయ ల‌ల్లో ఒక్క‌రూ త‌దుప‌రి రాష్ట్రపతి కావోచ్చు.    దీంతో తొలి గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత మోదీకి దక్కుతుంది. బిజూ జనతాదళ్‌, జేఎంఎం మద్దతు కూడా లభిస్తుంది. ఈ ఊహాగానాల‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.  

అదే త‌రుణంలో ద‌క్షిణాది వారికి ఈ సారి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తే.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు లేదా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్  తమిళిసైకి ప్రాముఖ్య‌త ఇచ్చే అవ‌కాశ‌ముంది. లేదా.. కశ్మీర్‌ సమస్య, పౌరసత్వ చట్టం, హిజాబ్‌ గొడవ, ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అధికార బీజేపీ.. ఇటు  జాతీయ, అటు అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందులు చిక్కుకుంది.  ఈ త‌రుణంలో బీజేపీ.. ముస్లిం వ్యతిరేక పార్టీ అనే ముద్ర‌ను తొలిగించుకోవాల‌నుకుంటే.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఆజాద్ లేదా ఆరిఫ్‌ ఖాన్‌లో ఒకరికి చాన్స్ వ‌స్తుంది. కశ్మీరీ చెందిన‌ నేత ఆజాద్ ను  రాష్ట్ర‌ప‌తి బరిలో దించుతే.. ప్రతిపక్షాల మద్దతు కూడా లభించే అవ‌కాశముంది. అలాగే.. ఆరిఫ్‌ ఖాన్ కూడా షాబానో కేసు నుంచి త్రిపుల్‌ తలాక్‌ వరకు బీజేపీకి మద్దతుగా నిలిచారు. వీరిలో ఏ ఒక్క‌రికి అవ‌కాశమిచ్చినా.. కాంగ్రెస్ కు రాజ‌కీయాల‌కు చెక్ కూడా చెప్ప‌వ‌చ్చ‌ని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
 
కాంగ్రెస్ ప్లానేంటీ ? 

బలమైన రాజకీయ నాయకుడిని రంగంలోకి దించితే ప్రతిపక్షాలు ఏకమయ్యే అవకాశాలుంటాయని కాంగ్రెస్‌  భావిస్తుంది. ఈ క్ర‌మంలో  కాంగ్రెస్‌ సూచించిన వ్యక్తి కాకుండా ఇతర ప్రతిపక్షాలు సూచించిన వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వాలని సోనియా కూడా భావిస్తున్నారు. పవార్‌, దేవెగౌడ ప్రస్తుతం ప్రతిపక్షాల్లో అత్యంత సీనియర్లు. పవార్‌ బలమైన నేత కనుక బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం