
బెంగళూరు : సుంకదకట్టెలో యువతిపై Acid attack ఘటన మరువక ముందే… అలాంటి ఘోరం మరొకటి నగరంలో పునరావృతం అయింది. పెళ్లికి నిరాకరించిందని ఓ Marriedపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. డిసిపి హరీష్ పాండే కథనం మేరకు యాసిడ్ దాడికి గురైన మహిళ కుమారస్వామి లే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని Karnataka అగరబత్తి పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమెకు వివాహం అయి, ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది.
ఇదే పరిశ్రమలో పని చేస్తు భార్యకు దూరంగా ఉన్న అహ్మాద్ కు, మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. వివాహం చేసుకుందామని కోరగా తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆమె అంగీకరించలేదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ విధులకు వెళ్తుండగా సారక్కి వద్ద అహ్మద్ గొడవపడి యాసిడ్ చల్లి ఉడాయించాడు. కుమారస్వామి లే అవుట్ పోలీసులు బాధితురాలిని వాసన్ ఐకేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కుమారస్వామి లేఔట్ పోలీసులు అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Social mediaలో love పేరుతో యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్న యువకుడిపై కరీంనగర్ పోలీసులు arrest చేశారు. వివరాల్లోకి వెళితే.. కోటి ఉమెన్స్ కాలేజీ లో Sanskrit teacherగా పనిచేస్తున్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీ లో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్ది రోజుల స్నేహం తర్వాత ఆ యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది.
అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. స్నేహంగా వుండే రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫోటోలను మార్పింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతిచోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడి పోస్తానని బెదిరింపులకు గురి చేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈనెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. భరద్వాజ్ కదలికలపై దృష్టిపెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి వివరణ ఇస్తూ.. కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు.