Odisha: ఒడిశాలో కోటి రూపాయల డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

By Mahesh Rajamoni  |  First Published Dec 22, 2021, 12:23 PM IST

Odisha: దేశంలో ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసులు పెరిగిపోతున్నాయి. వేల కోట్ల రూపాయ‌ల్లో సాగుతున్న ఈ మ‌త్తు  వ్యాపార అక్ర‌మాలు నిత్యం దేశంలో వెలుగుచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోటి రూపాయ‌ల మ‌త్తు ప‌ద‌ర్థాలు స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని ఒడిశా పోలీసులు తెలిపారు. 
 


Odisha: దేశంలో డ్రగ్స్ అక్ర‌మ విక్ర‌యాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. యువ‌త‌ను టార్గెట్ గా చేసుకుని మ‌త్తు ప‌ద‌ర్థాల వ్యాపారం సాగిస్తున్నారు కొంద‌రు అక్ర‌మార్కులు. ఇటీవ‌లి కాలంలో దేశంలో డ్ర‌గ్స్ సంబంధించిన కేసులు క్ర‌మంగా పెరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మాద‌క ద్ర‌వ్యాల‌ను విక్ర‌యిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కోటి రూపాయ‌ల విలువైన బ్రౌన్ షుగ‌ర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే..  భువనేశ్వర్‌లోని ఘటిపిరి ప్రాంతంలో ఇద్దరు డ్రగ్స్‌ వ్యాపారులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భువనేశ్వర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తేజ రాజా పటేల్ వెల్ల‌డించారు.  ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  మ‌త్తు ప‌ద‌ర్థాల విక్ర‌యాల‌కు పాల్ప‌డుతున్న వ్యక్తుల గురించి రాష్ట్రంలో గ‌త కొంత కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే డ్ర‌గ్స్  సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాము. ఈ నె 20న బ్రౌన్‌ షుగర్‌ వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందడంతో తమ బృందం ఘటిపిరి వద్ద దాడి చేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. వారి నుంచి 1.09 కిలోల బ్రౌన్‌ షుగర్‌ ఉన్న ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను కూడా  స్వాధీనం చేసుకున్నామని పటేల్‌ తెలిపారు. దీనిపై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని తెలిపారు. విచార‌ణ కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. 

Also Read: Omicron: దేశంలో కొత్త‌గా 13 ఒమిక్రాన్ కేసులు.. అత్య‌ధికం ఢిల్లీలోనే !

Latest Videos

undefined

మ‌త్తు ప‌ద‌ర్థాల‌తో ప‌ట్టుబ‌డిన నిందితులను రాకేష్ సాహూ, బసంత కుమార్ సాహూగా గుర్తించామ‌ని  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తేజ రాజా పటేల్ వెల్ల‌డించారు. అయితే, వీరికి ఈ డ్రగ్స్ ను స‌ర‌ఫ‌రా చేసిన వారి వివ‌రాలు ఇంకా తెలియ‌లేద‌ని పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ సాగిస్తున్నామ‌ని తెలిపారు. "బ్రౌన్ షుగర్ ధర సుమారు 1 కోటి రూపాయ‌ల‌ కంటే ఎక్కువ ఉంటుంది. దీనిపై ఇత‌ర స‌ర‌ఫ‌రా దారుల‌కు సంబంధించిన కోడ్ పేర్లు ఉన్న‌ట్లు తెలిసింద‌న్నారు. ప‌ట్టుబ‌డిన నిందితులు మ‌త్తు ప‌ద‌ర్థాల  స‌ర‌ఫ‌రా దారులు  పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా అంచ‌నా వేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి పూర్తిస్థాయి ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌నీ, త్వ‌ర‌లోనే అన్ని విష‌యాల‌ను ఛేదిస్తామ‌ని ప‌టేల్ వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే ఆదివారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెన్యాకు చెందిన 33 ఏళ్ల మహిళ నుంచి కూడా అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద రెండు కిలోల కన్నా ఎక్కువ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.  ఆ మహిళ పై కేసు న‌మోదుచేసిన పోలీసుల‌.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Also Read: Karnataka: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ మ‌త్తు ప‌ద‌ర్థాలు క‌ల‌క‌లం రేపాయి.  ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో (Indira Gandhi International Airport) బుధ‌వారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన మహిళ (woman from Uganda) వద్ద నుంచి అధికాలురు 2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 14.14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మహిళను పోలీసులు అడ్డగించారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా, 2020 గ్రాముల ఆఫ్‌ వైట్‌కలర్‌లో ఉన్న పౌడర్‌ను గుర్తించారు. దానిని పరీక్షించగా అది heroin అని తేలింది. దీంతో ఆ విదేశీ మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 కింద అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మహిళ దుబాయ్ నుంచి వచ్చిందని.. తమకు ముందస్తుగా ఉన్న సమాచారంతో ఆమె లగేజ్‌ను తనిఖీ చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇక, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఢిల్లీ 100 కిలోల వరకు హెరాయిన్‌ అధికారులు స్వాధీనం చేసుకొని, 26 మందిని అరెస్టు చేశారు. 

Also Read: అంగన్‌వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే : మంత్రి సత్యవతి రాథోడ్

click me!