
తమిళనాడు : తమను తరచూ బెదిరిస్తుండడంతో Mercenariesతో మాట్లాడి తోటి విద్యార్థినులే యువకుడిని murder చేయించినట్లు దర్యాప్తులో తేలింది. మంగళవారం తమిళనాడు, ఆరంబాక్కం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం గుమ్మడిపూండి, పెద్ద ఓబులాపురం పరిధిలోని ఈచ్చక్కాడులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం భూమిలో పాతిపెట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి policeలకు సమాచారం అందించారు.
తహసిల్దార్ మహేష్ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతుడు Chengalpattu జిల్లా గూడువాంజేరి సమీపంలోని మన్నివాక్కానికి చెందిన ప్రేమ్ కుమార్(20)గా గుర్తించారు.
చెన్నై, మీనంబాక్కం కాలేజీలో చదువుతున్న ఇతను తోటి విద్యార్ధినులతో Obscenityగా మాట్లాడేవాడని, ఇలా సంభాషించిన ఆడియోను తల్లిదండ్రులకు పంపినట్లు బెదిరించేవాడని తెలిసింది. ఇలా అతని ప్రవర్తనతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థినులు కిరాయి హంతకుల సాయంతో ప్రేమ్ కుమార్ ను హత్య చేయించినట్లు బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది.
దారుణం.. మతిస్థిమితం లేని పదమూడేళ్ల బాలిక మీద లైంగిక దాడి..
ఇదిలా ఉండగా, డిసెంబర్ 7న బీహార్ లో ఇలాంటి దారుణమైన ఘటనే జరిగింది. వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు.. వారంతట వారే ఒకరంటే ఒకరు ఇష్టపడి..ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్న పెళ్లి.. వారి ప్రేమకు, అన్యోన్యతకు గుర్తుగా ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు కూడా ఉన్నారు. కానీ అంతలోనే వారి మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఎంతగానో ప్రేమించిన భర్తనే అతి కిరాతకంగా చంపించేలా చేసింది. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన బీహార్ లో జరిగింది.
love marriage చేసుకున్న ఒక మహిళ మరో ప్రేమికుడి మోజులో పడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ప్రియుడి వద్దకు వెళ్లాలంటే భర్త అడ్డుగా ఉండడంతో దారుణానికి పాల్పడింది. తన Jewelry అమ్మిన డబ్బుతో ఆమె భర్తను చంపడానికి Supari ఇచ్చింది. ఈ ఘటన State of Biharలోని గయా నగరంలో జరిగింది.
బీహార్లోని గయ నగర పోలీసులకు నవంబర్ 23న ముహమ్మద్ తయ్యబ్ అనే వ్యక్తి శవం దొరికింది. మృతుడిని ఎవరో తుపాకులతో కాల్చి చంపారు. పోలీసులు ఈ హత్య కేసులో విచారణ ప్రారంభించారు. ముందుగా నగరంలోని Supari Killersను పట్టుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు ఈ హత్యకు సంబంధించిన కీలకమైన సమాచారం అందించారు. దాన్ని బట్టి పోలీసులు సులువుగా ఈ Murder caseను ఛేదించారు.
పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన ఆయోషా పర్వీన్ 12 ఏళ్ల క్రితం అదే నగరంలో నివసించే Muhammad Tayyab ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో Ayosha Parveenమరో యువకుడితో loveలో పడింది. అతను మంచి ఉద్యోగం చేస్తుండడంతో భర్త చేస్తున్న ఉద్యోగం, భర్త ఆమెకు నామోషీగా కనిపించడం మొదలయ్యింది.
ఒక సాధారణ ఉద్యోగం చేసే ముహమ్మద్ తయ్యబ్ తో ఆమె తన జీవితం కొనసాగించడం కష్టంగా భావించింది. తను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవాలనుకుంది. కానీ సమాజం భయంతో అలా చేయడానికి భయపడింది. అయితే భర్త చనిపోతే.. ఆ సమాజం ఏమీ అనదనుకుంది. అందుకే ముందు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనుకుంది.
అందుకు ఆమె ప్రియుడి సహాయంతో కొందరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది. తన భర్తను హత్య చేసేందుకు వారికి డబ్బులు ఇవ్వడానికి ఆయేషా దగ్గర అంత సొమ్ము లేదు. అందుకే తన నగలు తాకట్టు పెట్టింది. ఆ వచ్చిన డబ్బులతో ఆ కిరాయి హంతకులకు డబ్బు చెల్లించింది. మరుసటి రోజు ఉద్యోగం కోసం బయటికి వెళ్లిన తయ్యబ్ ను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.
హత్యా నేరంలో అనుమానితులుగా కొందరు కిరాయి హంతకులను పోలీసులు విచారణ చేయగా.. వారు ఈ హత్య మృతుడి భార్య చెప్పడంతోనే చేశామని అంగీకరించారు. దీంతో పోలీసులు ఆయోషా పర్వీన్, ఆమె ప్రియుడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు.