ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్‌ దంపతుల‌తో సహా ఐదుగురు మృతి..

Published : Jan 28, 2023, 10:22 AM IST
ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్‌ దంపతుల‌తో సహా ఐదుగురు మృతి..

సారాంశం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు వైద్యులు భార్యాభర్తలు. ధన్‌బాద్‌లోని బ్యాంక్ మోర్ ప్రాంతంలోని నర్సింగ్ హోమ్-కమ్-ప్రైవేట్ హౌస్ స్టోర్ రూమ్ వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది. ‘‘స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగడంతో ఊపిరాడక యజమాని, అతని భార్యతో సహా కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒక వ్యక్తి కూడా గాయపడ్డాడు’’ అని ధన్‌బాద్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్  ప్రేమ్ కుమార్ తివారీని తెలిపారు. 

మరణించిన వారిలో నర్సింగ్ హోమ్ యజమాని డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజ్రా, యజమాని మేనల్లుడు సోహన్ ఖమారి, ఇంటి పనిమనిషి తారా దేవి ఉన్నారు. మరణించినవారిలో నలుగురిని గుర్తించగా, ఐదవ వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉందని తివారీ తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu