ఉబర్ డ్రైవర్ మెసేజ్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన మహిళ...!

Published : Jan 28, 2023, 10:12 AM IST
  ఉబర్ డ్రైవర్ మెసేజ్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన మహిళ...!

సారాంశం

ఏది చెప్పినా... కొందరు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ మహిళకు ఉబర్ క్యాబ్ డ్రైవర్ చేసిన మెసేజ్... నెట్టింట వైరల్ గా మారింది.  

ఆఫీసు అయిపోయి... ఇంటికి వెళ్లేటప్పుడు చాలా మంది క్యాబ్ దొరకడం కోసం ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తారు. ఎందుకంటే... రాత్రి సమయంలో అంత తొందరగా క్యాబ్స్ బుక్ అవ్వవు. బుక్ అయ్యింది అనుకునేలోపు... డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది... క్యాష్ ఇస్తారా..? ఆన్ లైన్ పే మెంట్ చేస్తారా అని అడుగుతారు. ఏది చెప్పినా... కొందరు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ మహిళకు ఉబర్ క్యాబ్ డ్రైవర్ చేసిన మెసేజ్... నెట్టింట వైరల్ గా మారింది.

ఆషి అనే మహిళ బెంగళూరులో ఆఫీసు అయిపోయిన తర్వాత ఉబర్ క్యాబ్ కోసం ప్రయత్నించారు. డ్రైవర్ రైడ్ ఒకే చేసి... ఆ తర్వాత క్యాన్సిల్ చేయమని మహిళకు మెసేజ్ చేయడం విశేషం. కారణం.. తనకు నిద్ర వస్తోందని... అందుకు రైడ్ క్యాన్సిల్ చేయమని కోరడం విశేషం.

 

ఆ స్క్రీన్ షాట్ ని సదరు మహిళ.... ట్విట్టర్ లో షేర్ చేయగా.... అదికాస్త వైరల్ గా మారింది. ఈ పోస్టు 260 వేలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. కామెంట్ల వర్షం కురుస్తుంది. ఫస్ట్ టైమ్ క్యాబ్ బుక్ చేశారా అని కొందరు... ఇలాంటి కారణాలతో కూడా క్యాబ్ క్యాన్సిల్ చేస్తున్నారా అని మరి కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్