
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. రమేష్ నగర్‌లోని ఓ భవనంలోని రెండో అంతస్తులో మధ్యాహ్నం 3.31 గంటలకు జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది.
వారు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి, ఒక వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, ఒక మహిళ మంచంపై చనిపోయి, విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు.
17 ఏళ్ల బాలికపై పైశాచిక దాడి, లైంగిక వేధింపులు.. ఉద్యోగాలు కోల్పోయిన దంపతులు.
మృతులను విజయ్ కుమార్ (28), ఆంచల్ (25)గా గుర్తించారు. వీరిద్దరూ పటేల్ నగర్, ఆనంద్ పర్బత్ ప్రాంత నివాసితులని.. వీరిద్దరూ ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా పరిచయం అని పోలీసులు తెలిపారు. కుమార్ జిమ్ ట్రైనర్. కాగా, ఆంచల్ కెనడాలో చదువుతోంది. ఈ హత్యలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలను ఘటనా స్థలానికి పిలిపించినట్లు బన్సల్ తెలిపారు.
కీర్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రాథమికంగా హత్య కేసుగా ఇది నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డుల వివరాలు, శవపరీక్ష నివేదికలను విశ్లేషిస్తామని పోలీసులు చెప్పారు. అయితే, మహిళ శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు కనిపించలేదు. దీంతో పోస్ట్‌మార్టం నివేదికలో మృతికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి, శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కుమార్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. మహిళ జనవరిలో ఢిల్లీకి వచ్చింది. కానీ, ఆమె వచ్చిన సంగతి ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు. దీంతో వీరిద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.