కేంద్ర మంత్రి ఇంటిపై  రాళ్ల దాడి.. సమగ్ర విచారణ జరపాలని బీజేపీ డిమాండ్.. 

Published : Feb 10, 2023, 05:50 AM IST
కేంద్ర మంత్రి ఇంటిపై  రాళ్ల దాడి.. సమగ్ర విచారణ జరపాలని బీజేపీ డిమాండ్.. 

సారాంశం

కేరళలోని తిరువనంతపురంలో కేంద్ర మంత్రి వి మురళీధరన్ నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఉల్లూరులో మురళీధరన్ నివాసం వద్ద పార్కింగ్ కిటికీ అద్దాలు పగిలినట్టు గుర్తించి సిబ్బంది పోలీసులకు సమాచారం అందిచారు. 

తిరువనంతపురంలోని విదేశాంగ శాఖ సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ ఇంటిని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో మంత్రి నివాసంలోని పార్కింగ్ ప్ర‌దేశంలో కిటికీ అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ముర‌ళీధ‌ర‌న్ కార్యాల‌య‌ సిబ్బంది స‌మాచారం అందించ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్నారు.

గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిబ్బంది .. దాడి చేసినట్టు గమనించినట్లు అధికారి తెలిపారు. అనంతరం సిబ్బంది ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం నుంచి లభ్యమైన రక్తాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు ఘటనాస్థలిని పరిశీలించిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (DCP) అజిత్ కుమార్ నేతృత్వంలోని బృందం కేసును విచారిస్తోంది. నిందితుల గుర్తింపు కోసం పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఘటనాస్థలిని పరిశీలించిన సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, ఘటనకు బాధ్యులైన వ్యక్తులను పట్టుకుని వారి ఉద్దేశాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని తెలిపారు. ఇరుగుపొరుగు వారు దాడి చేసిన శబ్ధాలు, అలజడి వినిపించలేదని చెప్పారు.

అదే సమయంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. తిరువనంతపురంలోని మురళీధరన్ ఇంటిపై జరిగిన రాళ్లదాడిపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో తేలుస్తుందని  ముఖ్యమంత్రి అన్నారు.

సమాచారం ప్రకారం.. ఇంటిని ధ్వంసం చేసినప్పుడు మురళీధరన్ ఇంట్లో లేడు. విషయం తెలిసిన వ్యక్తుల ప్రకారం, ఇంటి సహాయకుడు కిటికీ అద్దం పగులగొట్టినట్లు గుర్తించి సంఘటన గురించి బంధువులు మరియు పార్టీ కార్యకర్తలకు తెలియజేశాడు. ఈ ఘటన వెనుక ఉన్న వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని, అయితే విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu