గంటల వ్యవధిలో కవల సోదరులు మృతి.. ఒకే చితిపై అంత్యక్రియలు.. రాజస్థాన్ లో విషాదం..

By team teluguFirst Published Jan 14, 2023, 1:01 PM IST
Highlights

రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కవల సోదరులు గంటల వ్యవధిలో చనిపోయారు. సోదరుడు చనిపోయాడన్న వార్త తెలుసుకున్న మరో సోదరుడు కూడా మరణించాడు. ఈ ఘటనతో బార్మర్ జిల్లాలోని సర్నో కా తలా గ్రామం మూగబోయింది.

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇద్దరు కవల సోదరులు విచిత్రమైన పరిస్థితులలో మరణించారు. ఒకరు చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే మరొకరు కన్నుమూశారు. ఒకరు గుజరాత్ లోని సూరత్ లో ఉన్న ఇంటి మేడపై నుండి పడి మరణించగా, మరొకరు జైపూర్ లో ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంకులో పడి చనిపోయారు.

లవర్‌తో సీక్రెట్ ప్లేస్‌కు వెళ్లిన యువతిపై బాయ్‌ఫ్రెండ్ ముందే గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు

ఈ ఘటనలో మరణించిన సోదరులు సుమేర్, సోహన్ సింగ్ లు రెండున్నర దశాబ్దాల క్రితం బార్మర్ జిల్లాలోని సర్నో కా తలా కవలలుగా జన్మించారు. అయితే అదే గ్రామంలో గురువారం ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుల్లో ఒకరైన సుమేర్ గుజరాత్ లోని టెక్స్ టైల్ సిటీలో పనిచేస్తుండగా, సోహన్ జైపూర్ లో గ్రేడ్ 2 టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. 

అయితే బుధవారం రాత్రి సుమేర్ ఫోన్ మాట్లాడుతుండగా మేడపై నుంచి జారిపడి మృతి చెందాడు. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే సోహన్ గురువారం తెల్లవారుజామున వాటర్ ట్యాంకులో పడిపోయాడు. అయితే సోహన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బార్మర్ లోని సింధారి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో సురేంద్ర సింగ్ తెలిపారు.

దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు సామూహిక ఆత్మహత్య.. ఎక్కడంటే ?

అయితే కవలల్లో పెద్దవాడైన సోహన్.. సోదరుడి మరణ వార్త తెలిసిన తరువాత తన గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువుకు సమీపంలో ఉన్న ట్యాంకు నుంచి నీరు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు దగ్గరకు వెళ్లారు. అయితే ఆ సమయంలో సోహన్ నీటిలో పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించాడు.

‘గవర్నర్​ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా..’ : త‌మిళ‌నాడు స‌ర్కారు-గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ముదురుతున్న వివాదం

కాగా.. మరో ఇద్దరు తోబుట్టువులు ఉన్న ఈ కవలల మధ్య చిన్నప్పటి నుంచి ఎంతో బలమైన అనుబంధం ఉందని ఆ గ్రామానికి చెందిన పోకర్ రామ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. ‘‘సుమేర్ చదువులో పెద్దగా రాణించలేదు. కానీ అతడు సోహన్ ను చదువుకోవాలని ప్రోత్సహించాడు. తన కవల సోదరుడు టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు, ప్రిపేరేషన్ కు అయ్యే ఖర్చులు అందించేందుకు సుమేర్ పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించేందుకు సూరత్ కు వెళ్లాడు ’’ అని చెప్పాడు. 
 

click me!