చనిపోయింది నా భర్త కాదు.. టీవీ నటి

Published : Dec 30, 2019, 12:16 PM IST
చనిపోయింది నా భర్త కాదు.. టీవీ నటి

సారాంశం

గోపీనాథ్ మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని... ఈ విషయంలో భార్య రేఖతో తరచూ గొడవపడుతూ ఉండేవాడని కూడా వార్తలు వచ్చాయి.

ఆత్మహత్యకు పాల్పడింది తన భర్త కాదని టీవీ నటి రేఖ చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం గోపీనాథ్ అనే వ్యక్తి పెరంబూర్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను బుల్లితెర సీరియల్ నటి రేఖ భర్త అంటూ వార్తలు వచ్చాయి. 

అంతేకాదు.. గోపీనాథ్ మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని... ఈ విషయంలో భార్య రేఖతో తరచూ గొడవపడుతూ ఉండేవాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనేది ఆ వార్తల సారాంశం. ఈ వార్తలపై తాజాగా నటి రేఖ స్పందించారు.

 ఆత్మహత్య చేసుకుంది తన భర్త కాదని, అతని భార్య పేరు జెనీఫర్‌ రేఖ అని తెలిపింది. ఆమె పేరులో రేఖ ఉండడంతో తన భర్త గోపీనాథ్‌ అని ప్రచారం చేశారని తెలిపారు. 

AlsoRead ఫైర్: టీవీ నటి భర్త ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య...

ఇదిలా ఉండగా... పెరంబూరు నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) అనే వ్యక్తి అన్నా నగర్ టీవీఎస్ కాలనీలోని ఓ ప్రైవేట్ ప్రచారం సంస్థలో కార్యనిర్వాకుడిగా పనిచేస్తున్నడు

గోపీనాథ్ భార్య రేఖ టీవీ నటి. వ్యాఖ్యత కూడా. గురువారం ఉదయం గోపీనాథ్ పనిచేస్తున్న కార్యాలయాన్ని తెరవడానికి కార్మికులు వచ్చారు. వారు లోనికి వెళ్లే సమయంలో గోపీనాథ్ గదిలో గదిలో ఉరేసుకుని కనిపించాడు. జేజే నగర్ పోలీసులు మృతదేహాన్ని కీల్ పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిం్చారు. 

భార్య రేఖతో గొడవ వల్లనే గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గోపినాథ్ పదేళ్ల క్రితం రేఖను ప్రేమించి పెళ్లాడాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేఖ ఓ ప్రైవేట్ టీవీ చానెల్ లో పనిచేస్తోంది.

ఆరు నెలల క్రితం గోపినాథ్ జేజే నగర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అదే సంస్థలో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రేఖకు, గోపీనాథ్ కు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త తీవ్ర దుమారం రేపడంతో.. నటి రేఖ స్పందించారు. అసలు ఆ వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?