'మీ డీపీని త్రివర్ణ పతాకంగా మార్చుకోండి' : హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

Published : Aug 13, 2023, 02:55 PM IST
'మీ డీపీని త్రివర్ణ పతాకంగా మార్చుకోండి' : హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

సారాంశం

Independent Day celebrations: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఇండిపెండెన్స్'తో దేశం సంబరాలు చేసుకుంటోంది. భారత స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచార స్ఫూర్తితో ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల్లోని డీపీల‌ను త్రివర్ణ పతాకంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.   

Har Ghar Tiranga Rally: Srinagar: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఇండిపెండెన్స్'తో దేశం సంబరాలు చేసుకుంటోంది. భారత స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచార స్ఫూర్తితో ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల్లోని డీపీల‌ను త్రివర్ణ పతాకంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.  ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పీఎం పిలుపునిచ్చారు. అలాగే, "#HarGharTiranga ఉద్యమ స్ఫూర్తితో, మన సోషల్ మీడియా ఖాతాల డీపీని మారుద్దాం. మన ప్రియమైన దేశం, మన మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే ఈ ప్రత్యేక ప్రయత్నానికి మద్దతు ఇద్దాం" అని ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా పిలుపునిచ్చారు. అలాగే, త్రివర్ణ పతాకంతో ఉన్న తమ ఫోటోలను www.harghartiranga.com లో అప్ లోడ్ చేయాలని ఆయన ప్రజలను కోరారు.


'హర్ ఘర్ తిరంగా' ప్రచారం..

'హర్ ఘర్ తిరంగా' ప్రచారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కొన‌సాగుతోంది. ఇది భారతదేశ 76 వ స్వాతంత్య్ర‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకమైన తిరంగాను వారి ఇళ్లలోకి తీసుకురావడానికి, దానిని ఎగురవేయడానికి దేశ ప్రజలను ప్రేరేపించడానికి లక్ష్యంగా పనిచేస్తుంది."76 వ స్వాతంత్య్ర‌ సంవత్సరంలో ఒక దేశంగా జెండాను సామూహికంగా ఇంటికి తీసుకురావడం తిరంగాతో వ్యక్తిగత సంబంధానికి చిహ్నంగా మాత్రమే కాకుండా, జాతి నిర్మాణం పట్ల మా నిబద్ధతకు ప్రతిరూపంగా మారుతుంది" అని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్రజల హృదయాల్లో దేశభక్తి భావనను పెంపొందించడం, భారత జాతీయ పతాకంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశమని పేర్కొంది. 

ఫుల్ డ్రెస్ రిహార్సల్..

ఆగస్టు 15న జరగాల్సిన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు రిహార్స‌ల్స్  జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో రాబోయే స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల కోసం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఏర్పాటు చేశారు. ఫలితంగా ఢిల్లీలోని పలు రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేశారు. అంతేకాకుండా, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచిస్తూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక నోటీసు జారీ చేశారు. ఉదయం 11 గంటల వరకు ఢిల్లీలోని పలు మార్గాలను మూసివేశారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !