
బుద్ధిగా చదువుకోవాలని, బాలికలతో మాట్లాడకూడదని సూచించినందుకు ఓ స్టూడెంట్ టీచర్ ను కత్తితో పొడిచాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ అయిన నిందితుడిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆ టీచర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం.. పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం..
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ముంబాయిలోని మీరా రోడ్డులో 26 ఠాకూర్ అనే టీచర్ ట్యూషన్ చెపుతుంటారు. అయితే అతడి వద్ద ట్యూషన్ కోసం స్థానిక ప్రాంతాల నుంచి బాలురు, బాలికలు వస్తుంటారు. అయితే కొంత కాలం కిందట ఓ బాలుడు బాలికతో తరచూ మాట్లాడటాన్ని ఠాకూర్ గమనించారు. దీంతో బాలికతో మాట్లాడకూడని, వారితో సన్నిహితంగా ఉండకూడదని ఆయన విద్యార్థికి సూచించారు. చక్కగా చదువుకోవాలని చెప్పాడు.
ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిపై చెప్పులతో దాడి.. వీడియో వైరల్
దీంతో ఆ బాలుడు టీచర్ పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఠాకూర్ రోడ్డుపై నిలపడి పలువురు యువకులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో బాలుడు ఓ కత్తి తీసుకొని వచ్చి టీచర్ పై దాడి చేయబోయాడు. పక్కనున్న అందరూ ఆ బాలుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ బాలుడు ఆగకుండా టీచర్ ను పొడిచాడు. ఠాకూర్ కింద పడిపోయినా ఆగకుండా పొడుస్తూనే ఉన్నాడు. అనంతరం కత్తిని అక్కడే పారేసి పారిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..
గాయాలపాలైన టీచర్ ను అక్కడున్న స్థానికులు ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడైన మైనర్ బాలుడిని గుర్తించారు. ఘటనా స్థలం నుంచి కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ట్యూషన్ క్లాసులు చెప్పే సమయంలో టీచర్ ఠాకూర్ బాలుడిని కొట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.