దేశం కోసం ప్రాణాలర్పించకపోయినా.. దేశంలో జీవించే అరుదైన అవకాశం లభించింది

Published : Aug 13, 2023, 02:28 PM ISTUpdated : Aug 13, 2023, 02:49 PM IST
దేశం కోసం ప్రాణాలర్పించకపోయినా.. దేశంలో జీవించే అరుదైన అవకాశం లభించింది

సారాంశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయ్యిందనీ, ప్రస్తుతం దేశ స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన స్థితి ఏమీ లేదని వెల్లడించారు. 

కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో తిరంగా యాత్రను ప్రారంభించారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 
 అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిందన్నారు. ప్రస్తుతం దేశ స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన స్థితి ఏమీ లేదని, తమకు దేశం కోసం ప్రాణాలర్పించే పరిస్థితి లేకపోయినా.. దేశం కోసం జీవించే అరుదైన అవకాశం లభించిందని అన్నారు. 

మాతృభూమి కోసం బతికే తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ప్రతి ఇంట్లోనూ దేశ భక్తి ఉప్పొంగాలని ఆకాంక్షించారు. అందుకే ప్రధాని మోదీ హర్‌ఘర్ తిరంగాతో అందరిలోనూ స్ఫూర్తి రగిలించారనన్నారు.  స్వాతంత్య్ర నాటి అమృత్ మహోత్సవంలో దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంపొందించే పనిని నరేంద్ర మోదీ చేశారని అన్నారు. అలాగే ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకాల ప్రచారానికి సంబంధించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోని ప్రతి చిన్నారి, ప్రతి యువకుడి మనసులో దేశభక్తిని రగిలించేలా ప్రధాని మోదీ ప్రచారాన్ని ప్రారంభించారని అమిత్ షా అన్నారు. ఇవాళ వేలాది మంది త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నినాదాలు చేస్తుంటే.. ప్రధాని లక్ష్యం నెరవేరినట్లేనని అన్నారు. ఆ ప్రచారం విజయవంతం కావాలని ఆశించారు. 

గతేడాది హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చిందనీ, 2022 ఆగస్టు 15న దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని ఇల్లు లేదని, ఈ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ప్రధాని మోదీ మరో సారి ఉద్యమానికి మరో సారి పిలుపు ఇచ్చారనీ, ప్రతి భారతీయుడు తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనీ,దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో నిండిపోవాలని అన్నారు.  

ప్రధాని మోదీ విజ్ఞప్తి 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మరోసారి హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ఉద్యమానికి పిలుపునిచ్చారు. గతేడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తమ డిపిని మార్చడం ద్వారా ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. 'ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాక ఉద్యమం స్ఫూర్తితో, మన సోషల్ మీడియా ఖాతా డీపీని మారుద్దాం, దేశంతో మన సంబంధాన్ని బలోపేతం చేయడానికి, బలోపేతం చేయడానికి మా మద్దతును అందిద్దాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో ప్రధాని డీపీ మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాలో త్రివర్ణ పతాకం ఫొటోను పోస్ట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !