ఉదయాన్నే రోజూ కోడికూస్తోందని... పోలీసులకు ఫిర్యాదు...!

By telugu news teamFirst Published Nov 30, 2022, 2:42 PM IST
Highlights

ఓ వ్యక్తికి మాత్రం ఉదయాన్నే కోడి లేచి డిస్టర్బ్ చేస్తోంది అని చెప్పి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓ డాక్టర్ కావడం గమనార్హం. 

గ్రామాల్లో పొద్దునే కోడి కూయడం చాలా కామన్. దాదాపు గ్రామాల్లో...కోడి కూతతోనే చాలా మంది నిద్రలేస్తారు. అయితే... ఓ వ్యక్తికి మాత్రం ఉదయాన్నే కోడి లేచి డిస్టర్బ్ చేస్తోంది అని చెప్పి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓ డాక్టర్ కావడం గమనార్హం. ఈ సంఘటన  మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కి చెందిన అలోక్ మోడీ అనే వ్యక్తి వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు. అతను పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ ఆస్పత్రి సమీపంలోని సిల్వర్ ఎన్ క్లేవ్ లో నివసిస్తున్నాడు. కాగా... అతను పాపం ఆస్పత్రిలో రోజంతా డ్యూటీ చేసి.... అర్థరాత్రి ఇంటికి వచ్చి పడుకుంటాడట. అయితే.... ఉదయాన్నే కోడి కూస్తూ... అతని నిద్రకు భంగం కలిగిస్తోందట.

అది ఊరికే నిద్రకు భంగం కలిగించడంతో... అతను అలసిపోయాడు. దానిని బుట్టలో పెట్టి ఉంచమని యజమానికి కూడా చెప్పాడు. అతను పట్టించుకోలేదు. దీంతో... విసిగిపోయి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడి రోజూ తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల మధ్య కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ కంప్లైంట్‌ని పోలీసులకు స్వీకరించారు. అంతేకాదు కోడి యజమాని వందన విజయన్‌పై సెక్షన్‌ 138 కింద కేసు పెట్టారు.

click me!