అత్యాచార ఘటనపై వాంగ్మూలం ఇవ్వడానికి జడ్జి ఛాంబర్ కు బాధితురాలు వెళ్లింది. ఆమె బాధను విని న్యాయం చేయాల్సిన ఆ జడ్జి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. (Tripura judge accused of sexually assaulting rape victim) ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది.
న్యాయం చేయాల్సిన న్యాయమూర్తే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అత్యాచార బాధితురాలిపై ఆయన కూడా లైంగిక వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ ఘటన త్రిపురలో వెలుగులోకి వచ్చింది. త్రిపుర కోర్టులోని మేజిస్ట్రేట్ ఛాంబర్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అత్యాచార బాధితురాలు ఆరోపించింది. అయితే దీనిపై ధలాయ్ జిల్లా సెషన్స్ జడ్జి గౌతమ్ సర్కార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.
ఏసీబీకి చిక్కిన ఎస్ఈ జగజ్యోతి.. ఇంట్లో రూ.65 లక్షలు, 2.5 కేజీల బంగారం లభ్యం.. కన్నీటి పర్యంతం
తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు ఫిబ్రవరి 16న కమల్ పూర్ లోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఛాంబర్ కు వెళ్లానని బాధితురాలు తెలిపింది. తాను వాంగ్మూలం ఇవ్వబోతుండగా జడ్జి అసభ్యంగా ప్రవర్తించారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. వెంటనే ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఈ విషయాన్ని న్యాయవాదులకు, తన భర్తకు తెలియజేశానని చెప్పారు. దీనిపై కమలాపూర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశారు.
అయోధ్య బాలరాముడిని చూపిస్తూ మొదడు ఆపరేషన్.. మధ్యలో ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు..
అయితే ఈ ఘటనపై బాధితురాలి భర్త కూడా వేరుగా కమల్ పూర్ బార్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జిల్లా, సెషన్స్ జడ్జి సర్కార్, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సత్యజిత్ దాస్ తో కలిసి కమల్ పూర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కార్యాలయానికి వెళ్లి విచారణ ప్రారంభించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ కోర్టు ఆవరణలో కమల్ పూర్ బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి బాధితురాలి ఆరోపణలపై అభిప్రాయాన్ని కోరింది.
Mystery : శివపురి అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. అసలేం జరిగింది..?
కాగా.. దీనిపై త్రిపుర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వి.పాండే ‘పీటీఐ’తో మాట్లాడారు. ఈ విషయంలో తమకు ఇంకా ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదన్నారు. అందరిలాగే తాను కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నానని అన్నారు. సరైన ఫార్మాట్ లో ఫిర్యాదు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.