డిజి-యాత్ర యాప్ ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలోనే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో తన సేవలను ఈ యాప్ విస్తరించనుంది.
న్యూఢిల్లీ: డిజి-యాత్ర యాప్ ను వినియోగించుకోవడంలో బెంగుళూరు, ఢిల్లీ ప్రయాణీకులు ముందు వరుసలో నిలిచారు.2022 డిసెంబర్ లో డిజి-యాత్ర యాప్ ప్రారంభించారు. ఈ యాప్ ప్రారంభించిన 14 నెలల్లోనే 1.4 కోట్ల మంది ప్రయాణీకులు దీన్ని ఉపయోగించుకున్నారు.
భారతదేశ టెక్నాలజీ పురోగతికి డిజి-యాత్ర యాప్ నిదర్శనంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా 13 విమానాశ్రయాల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. డిజి-యాత్ర యాప్ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. బెంగుళూరు, ఢిల్లీ నుండి ఎక్కువ మంది ఈ యాప్ ద్వారా సేవలు పొందినట్టుగా కేంద్ర పౌర విమానయాన సంస్థ ప్రకటించిందని టైమ్స్ ఆఫర్ ఇండియా నివేదిక తెలిపింది.
also read:పెళ్లి పందిరిలోనే వధువు కాళ్లు తాకిన వరుడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్
2022 డిసెంబర్ మాసంలో ఢిల్లీ, బెంగుళూరు, వారణాసిలలో ఈ యాప్ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని విజయవాడ, కోల్‌కత్తా, హైద్రాబాద్, పుణెలకు 2023 ఏప్రిల్ నాటికి విస్తరించారు.2023 ఆగస్టు మాసంలో ముంబై టెర్మినల్ లో కూడ డిజి-యాత్ర సేవలు అందుబాటులోకి వచ్చింది. ముంబై టీ 2 టెర్మినల్ లో మూడు లక్షల మంది ఈ సేవలను వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా 1.1 కోట్ల మంది ఈ యాప్ సేవలను పొందారు.
also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో
డిజి-యాత్ర ద్వారా తన విలువైన సమయం ఎలా ఆదా అయిందో వెంచర్ క్యాపిటల్ మేనేజింగ్ భాగస్వామి తేజ్ కపూర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను తాను వెళ్లాల్సిన ఫ్లైట్ ను ఎలా ఈ యాప్ ద్వారా చేరుకున్నానో టెక్కీ ఆశిష్ నాథనీ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.ఢిల్లీ విమానాశ్రయం వెబ్ సైట్ సమాచారం మేరకు ఒక గేట్ వద్ద డిజి-యాత్ర ప్రయాణీకుల ప్రాసెసింగ్ సమయం కేవలం మూడు సెకన్లు మాత్రమే.