త్రిపుర ఈశాన్య రాష్ట్రాలకు అంతర్జాతీయ వాణిజ్య గేట్‌వేగా ఎదుగుతోంది: ప్రధాని మోడీ

By Mahesh RajamoniFirst Published Dec 19, 2022, 2:17 AM IST
Highlights

Agartala: మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య మండలి (NEC) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్ర‌మంలోనే షిల్లాంగ్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో బహుళ ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో త్రిపురలో మెరుగైన పాలన సాగుతున్నదని తెలిపారు. 
 

Prime Minister Narendra Modi: కేంద్రంలో, రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల అభివృద్ధి కారణంగా త్రిపుర ఈశాన్య రాష్ట్రాలకు అంతర్జాతీయ వాణిజ్య గేట్‌వే, లాజిస్టిక్స్ హబ్‌గా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య త్రిపురలో వచ్చే ఏడాది జూన్‌లో అమలు కానున్న కొత్త రైల్వే లైన్ గురించి ఆయన మాట్లాడుతూ, "అగర్తలా-అఖౌరా రైల్వే లైన్‌ను ప్రవేశపెట్టడంతో వాణిజ్య సంబంధాల పరిధి మ‌రింత పెరుగుతుంద‌ని" తెలిపారు. అలాగే, భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్‌లను రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించడం ద్వారా ఈశాన్య ప్రాంతం తన కనెక్టివిటీ-సంబంధాలను అభివృద్ధి చేస్తోందని అగర్తలలోని స్వామి వివేకానంద స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మోడీ అన్నారు.

రెండు దేశాలు 2013లో రైల్వే ప్రాజెక్ట్ కోసం అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. బ్రిటిష్ కాలంలో అఖౌరా అగర్తలాకు రైల్వే లింక్ కొన‌సాగింది. ఇండో-బంగ్లా రైలు మార్గం భారతదేశంలోని నిశ్చింతపూర్ వద్ద అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ స్టేషన్ ద్వారా బంగ్లాదేశ్ అఖౌరాను కలుపుతుంది. మహారాజా బిర్ బిక్రమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభంతో త్రిపుర కనెక్టివిటీలో పురోగమించింది. దీని ద్వారా రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాలకు లాజిస్టిక్ హబ్‌గా అవతరించిందని ప్ర‌ధాని త‌న ప్రసంగంలో చెప్పారు. ఈ జనవరి ప్రారంభంలో కొత్త టెర్మినల్ భవనం, మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోడీ త్రిపురలో పర్యటించారు. ‘‘త్రిపుర సర్వతోముఖాభివృద్ధిపైనే మా దృష్టి ఉంది. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి పథానికి పురికొల్పుతాయి’’ అని ప్ర‌ధాని అన్నారు.

“మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను కేటాయించాము. డాక్టర్ మాణిక్ సాహా (త్రిపుర ముఖ్యమంత్రి) ఆధ్వర్యంలోని త్రిపుర ప్రభుత్వం, అతని బృందం ఈ ప్రాజెక్టులను సక్రమంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నాయి” అని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఇదివ‌ర‌కు ఈశాన్య ఎన్నికలు, హింసాత్మక అంశాలపై మాత్రమే ముందుగా చర్చకు వచ్చేదని ఆయన అన్నారు. “ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు త్రిపురలో మౌలిక సదుపాయాల కల్పన, లక్షలాది మందికి ఇళ్ల కేటాయింపు, స్వచ్ఛత (పరిశుభ్రత)పై చర్చ జరుగుతోంది’’ అని మోడీ అన్నారు. పరిశుభ్రతపై మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో త్రిపురలో ఇది ప్రజా ఉద్యమంగా మారిందనీ, ఫలితంగా దేశంలోని చిన్న రాష్ట్రాల్లో స్వచ్ఛమైన రాష్ట్రంగా త్రిపుర‌ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు.

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇతర రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోడీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రెండు లక్షల మంది లబ్ధిదారుల 'గృహ ప్రవేశ'లో చేరారు. ఆనందనగర్‌లో త్రిపుర స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇందిరా గాంధీ మెమోరియల్ (ఐజిఎం) హాస్పిటల్‌లో అగర్తల ప్రభుత్వ డెంటల్ కాలేజీని ప్రారంభించింది. జాతీయ రహదారి 8ని విస్తరించే ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు తమకు కేటాయించిన ఇళ్లలోకి ప్రవేశిస్తారనీ, అందులో ఒక్కో కుటుంబంలోని మహిళా సభ్యులే ఎక్కువగా ఉంటారని ఆయన చెప్పారు.
 

click me!