త్వరలో దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ .. కేంద్ర మంత్రి సంకేతాలు, ఎప్పటి నుంచి అంటే..?

By Siva KodatiFirst Published Dec 18, 2022, 9:44 PM IST
Highlights

బీఎస్ఎన్ఎల్ 5జీకి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్దినెలల్లో బీఎస్ఎన్ఎల్ 5జీ అప్‌గ్రేడేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. 

దేశంలో 5జీ సేవలకు సంబంధించి కీలక ముందడుగు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 1న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతా బాగానే వుంది కానీ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సంస్థ సంగతేంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కూడా 5జీ సేవలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొద్దినెలల్లో బీఎస్ఎన్ఎల్ 5జీ అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలోని 1.35 లక్షల టవర్లతో ఇది ప్రారంభం అవుతుందని వైష్ణవ్ తెలిపారు. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

బీఎస్ఎన్ఎల్ 5జీకి టీసీఎస్ టెక్నికల్ సపోర్ట్‌ను అందిస్తుందని గత కొన్నిరోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. 5జీ ట్రయల్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు చేరుకోని ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ తొలిగా చేరుకుంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో జియో, ఎయిర్‌టెల్‌లు ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. 

Also REad: 5జీ ప్రారంభం.. 130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ అందించిన బహుమతి: ప్రధాని మోదీ

కాగా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, అదానీ డేటా సర్వీసెస్, వోడాఫోన్ ఐడియాలు రూ. 1,50,173 కోట్ల విలువైన 5G స్పెక్ట్రమ్‌కు వేలం వేసాయి. రిలయన్స్ జియో మొత్తం విలువలో 58.65 శాతం వాటాతో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. 43,084 కోట్ల విలువైన బిడ్‌లతో పాల్గొన్న నలుగురిలో భారతీ ఎయిర్‌టెల్ రెండవ అతిపెద్ద బిడ్డర్ గా ఉంది. 

1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHzలలో 6,228 MHz స్పెక్ట్రమ్‌లను కొనుగోలు చేసేందుకు Vodafone Idea Limited రూ.18,799 కోట్ల విలువైన బిడ్‌లు వేసింది. భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ మొట్టమొదటి వేలం జూలై 26న ప్రారంభమైంది. ఏడు రోజులలో జరిగిన మొత్తం 40 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత వేలం కోసం బిడ్డింగ్ ముగిసింది. మొత్తం 40 రౌండ్ల బిడ్డింగ్ నిర్వహించారు. అంతకుముందు ఆగస్టులో, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను ప్రభుత్వం జారీ చేసింది. అదే సమయంలో దేశంలో 5G సేవలను రోల్ అవుట్ చేయడానికి సిద్ధం చేయాలని కోరింది. అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.
 

click me!