ట్రిపుల్ తలాఖ్ బిల్లు: గట్టెక్కిన మోడీ సర్కార్, సహకరించిన బాబు, కేసీఆర్

By narsimha lodeFirst Published Jul 30, 2019, 6:42 PM IST
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా  99ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.
 


న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా  99ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీఆర్ఎస్, టీడీపీ, జేడీయూ నిర్ణయం తీసుకొన్నాయి.ఈ బిల్లును నిరసిస్తూ జేడీ(యూ), అన్నాడీఎంకెలు రాజ్యసభ నుండి వాకౌట్ చేశాయి. 

స్లిప్పుల ద్వారా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, వైసీపీ,  బీఎస్పీ,ఆర్జేడీ, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓటింగ్ జరిగిన సమయంలో రాజ్యసభలో 220 మంది ఎంపీలు ఉన్నారు. సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 111 మంది ఎంపీల మద్దతు అవసరం.

ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్  కమిటీ పంపాలని నిర్ణయంపై 84 ఓట్లు వచ్చాయి, సెలెక్టు కమిటీకి పంపాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 100 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుపై విపక్షాలు ఇచ్చిన పలు సవరణలు వీగిపోయాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా అన్నాడిఎంకె, జేడీ(యూ) వాకౌట్ చేశాయి. ఈ బిల్లుపై ఓటింగ్ కు టీడీపీ, టీఆర్ఎస్, జేడీ(యూ) నిర్ణయం తీసుకొన్నాయి. ఈ పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉండడం  పరోక్షంగా అధికార బీజేపీకి సహకరించినట్టైంది. 

విపక్షాల సవరణలు వీగిపోయిన తర్వాత ఈ బిల్లుపై వ్యతిరేకంగా తాము ఓటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. దీంతో బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆజాద్ కోరాడు. దీంతో ఓటింగ్ నిర్వహించారు.ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. ఇటీవలనే లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది.

సంబంధిత వార్తలు

ట్రిపుల్ తలాక్ బిల్లు: వ్యతిరేకించిన వైఎస్ఆర్‌సీపీ

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు: కేసీఆర్, జగన్ ఏం చేస్తారు?

click me!