పెళ్లైన తొమ్మిదినెలలకే.. నల్లగా ఉన్నావంటూ త్రిపుల్ తలాక్... ఓ భర్త శాడిజం...

By AN TeluguFirst Published Nov 22, 2021, 3:22 PM IST
Highlights

భార్య నల్లగా ఉందంటూ ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో వెలుగులోకి వచ్చింది. నల్లగా ఉన్నాననే కారణంతో తన భర్త లాక్ చెప్పాడంటూ ఓ  మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఉత్తర ప్రదేశ్ : భారీగా కట్న కానుకలు తీసుకుని.. ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తొమ్మిది నెలలపాటు జీవనం సాగించాడు. చివరికి మోజు తీరిన తరువాత భార్య నల్లగా ఉందన్న విషయం గుర్తుకువచ్చింది. ఇంకేముందు తనకున్న ఫెసిలిటీని మిస్ యూజ్ చేశారు. ఓ యువతి జీవితాన్ని నిలువుగా ముంచేశాడు. 

భార్య blackగా ఉందంటూ triple talaq చెప్పాడు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ షాకింగ్ ఘటన Uttar Pradesh లోని బరేలీలో వెలుగులోకి వచ్చింది. నల్లగా ఉన్నాననే కారణంతో తన Husband తలాక్ చెప్పాడంటూ ఓ 
Woman Police Station లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్త సహా, ఎనిమిద మంది మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్ ప్రాంతానికి చెందిన యువతిని తొమ్మిది నెలల క్రితం మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో సుమారు మూడెకరాల భూమి, ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. ఆ సమయలో మహ్మద్ ఆలం చాలా సంతోషంగానే వీటిని అంగీకరించాడు. వివాహాన్ని హ్యాపీగా చేసుకున్నాడు. అలా కొన్ని రోజుల పాటు ఆమెతో కాపురం చేశాడు. ఆ తరువాతే ఆలంలోని మృగం నిద్ర లేచింది. తాను తీసుకున్న కట్నం తక్కువ అనిపించింది. అంతే Extra dowry కోసం వేధించడం ప్రారంబించాడు. 

నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్.. నోట్లో తుపాకీ పెట్టి బెదిరించి, అసభ్య ప్రవర్తన...

పెళ్లైన సంవత్సరం లోపే ఈ పరిస్థితి ఎదురుకావడంతో బాధితురాలికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే దీనికీ మహ్మద్ ఆలమే ఉపాయం కూడా చెప్పాడు. బాధితురాలి తండ్రి వద్ద మిగిలి ఉన్న landని విక్రయించి రూ.10 లక్షలు తేవాలని హింసించడం మొదలుపెట్టాడు. అందుకు మహిళ నిరాకరించింది. ఇప్పటికే తన పెళ్లికి, కట్నానికి పుట్టింటివారు చాలా అప్పులు చేశారని, ఇప్పుడు ఉణ్న భూమి కూడా అమ్మమనడం సరికాదని ఒప్పుకోలేదు.. దీంతో ఆలం భార్య మీద attack చేశాడు. అయితే, ఈ సమయంలో తండ్రి జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగినట్లు మహిళ ఫిర్యాదులో తెలిపింది. 

ఆ తర్వాత హింస రూపం మార్చుకుందని యువతి తెలిపింది. అదనపు కట్నం ఎలాగూ రాదని నిర్ణయానికి వచ్చి.. తనను బాడీ హేమింగ్ కు గురి చేయడం మొదలు పెట్టారు. తాను నల్లగా ఉన్నానంటూ తన భర్త, అత్తింటివారు హేళన చేయటంతోపాటు ప్రతిరోజు హింసిస్తున్నారని వెల్లడించింది. 

ఈ క్రమంలో నల్లగా ఉన్నావు.. ఇక వద్దంటూ తన భర్త ఆలం మూడు సార్లు తలాక్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడని బాధితురాలు బరేలీ ఎస్ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త ఆలం, అత్తామామ సహా.. ఎనిమిది మంది మీద కాంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ రాజీవ్ సింగ్ వెల్లడించారు. 
 

click me!