నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్.. నోట్లో తుపాకీ పెట్టి బెదిరించి, అసభ్య ప్రవర్తన...

By AN TeluguFirst Published Nov 22, 2021, 2:44 PM IST
Highlights

గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. నాలుగేళ్ల చిన్నారిని నోరు తెరవాలని బెదిరించాడు. నోట్లో గన్ పెట్టి, మంచం మీద పడేసి.. కొడుతున్న వీడియో వాట్సప్ లో వచ్చింది. తల్లి లేని చిన్నారికి హింసించారు. పోలీసులు ఇది చాలా చిన్న కేసు అంటున్నారు. అందుకే ఎస్ పీని కలిసేందుకు వచ్చా. బాలుడిని విడిపింకపోతే డీఐజీ కార్యాలయానికి కూడా వెళ్తా’ అని చిన్నారి బంధువు విజేంద్ర పేర్కొన్నారు. 

మొరాదాబాద్ : నాలుగేళ్ల బాలుడిని అపహరించి కొట్టడమే కాక, నోట్లో తుపాకీ పెట్టి బెదిరించాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో Social mediaల్లో వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా దిలారి ప్రాంతంలోని ఇలార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

‘గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి బాలుడిని Kidnap చేశాడు. నాలుగేళ్ల చిన్నారిని నోరు తెరవాలని బెదిరించాడు. నోట్లో gun పెట్టి, మంచం మీద పడేసి.. కొడుతున్న వీడియో వాట్సప్ లో వచ్చింది. తల్లి లేని చిన్నారికి హింసించారు. పోలీసులు ఇది చాలా చిన్న కేసు అంటున్నారు. అందుకే ఎస్ పీని కలిసేందుకు వచ్చా. బాలుడిని విడిపింకపోతే డీఐజీ కార్యాలయానికి కూడా వెళ్తా’ అని చిన్నారి బంధువు విజేంద్ర పేర్కొన్నారు. వీడియోలోని మాటల ఆధారంగా బాలుడిని అపహరించింది అజిత్ అనే వ్యక్తిగా ఆరోపించారు. 

మరోవైపు గ్రామానికి చెందిన ఓ యువకుడు చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం అందిందని సీఐ అనూప్ కుమార్ తెలిపారు. నిందితుడు అజిత్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు వివరించారు. 

మరోవైపు ఝార్ఖండ్ లో ఓ దారుణం జరిగింది. తల్లితో కలిసి పొలంపనులకు వెళ్ళిన బాలికను ఓ పద్నాలుగేళ్ల బాలుడు తోటలోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఝార్ఖండ్ లో వెలుగుచూసింది. అయితే ఈ అఘాయిత్యానికి పాల్పడింది పెద్దింటి బాలుడు కావడం... బాధిత బాలిక అణగారిన వర్గాలను చెందినది కావడంతో గ్రామపెద్దలు సైతం నిందితుడికే అండగా నిలిచారు. బాలిక శీలానికి వెలకట్టి దారుణానికి పాల్పడిన బాలుడిని కాపాడే ప్రయత్నం చేసారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. jharkhand state లోని గొడ్డా జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పెద్దింటి బాలుడు బబ్లూ(14). అతడు చిన్నతనంలోనే చెడుమార్గాల బాటపట్టి గ్రామంలోని అమ్మాయిలను వేధించేవాడు. అతడి వేధింపుల గురించి గ్రామస్తులందరికీ తెలిసినా పెద్దింటి బాలుడు కాబట్టి ఏమీ అనలేకపోయేవారు. ఇదే అదునుగా బబ్లూ మరింతగా రెచ్చిపోయాడు. 

ఎస్ఐని చంపిన మేకల దొంగలు.. 24 గంటల్లో నిందితులు అదుపులోకి..

అదే గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన బాలికపై ఈ నీచుడి కన్ను పడింది. దీంతో నిత్యం బాలికను వేధించేవాడు. అయితే బాలిక తల్లితో కలిసి పొలానికి వెళ్లగా బబ్లూ కూడా వారిని అనుసరించి వెళ్లాడు. ఈ క్రమంలో అదును చూసుకుని బాలిక ఒంటరిగా వుండగా బలవంతంగా పొలాల్లోకి లాక్కెల్లాడు. అరిచి గోలచేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత పాశవికంగా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అత్యాచారం అనంతరం బబ్లూ అక్కడినుండి పరారవగా బాలిక తల్లివద్దకు వెళ్ళి జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో తల్లి గ్రామంలోకి వెళ్ళి పెద్దలకు విషయం తెలియజేసి పంచాయితీ పెట్టింది. అయితే బబ్లూ కుటుంబాన్ని ఎదురించి అతడికి శిక్ష విధించే దమ్ములేని గ్రామపెద్దలు బాలిక శీలానికి వెలకట్టే ప్రయత్నం చేసారు. దీంతో ఇక గ్రామ పెద్దలతో తమకు న్యాయం జరగదని భావించిన బాధిత బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. 

తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు బబ్లూతో పాటు అతడిని కాపాడే ప్రయత్నం చేసిన గ్రామపెద్దలపై కూడా ఆ తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న బబ్లూను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. 
 

click me!