రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్

By narsimha lode  |  First Published Mar 11, 2024, 10:34 AM IST

బస్సుల్లోనే కాదు రైలులో కూడ సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 



న్యూఢిల్లీ: రైలులో  సీటు కోసం  ఇద్దరు మహిళలు ఓ వ్యక్తితో గొడవపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  రైలులో  చుట్టూ ప్రయాణీకులు వీరి గొడవను ఆసక్తిగా గమనిస్తున్నట్టుగా వీడియోలో దృశ్యాలున్నాయి.  ఓ మహిళ పురుషుడి కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీస్తున్నట్టుగా వీడియోలో  ఉంది.  

also read:యూపీ సీఎం యోగి ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్: కేసు నమోదు

Latest Videos

డెహ్ర- గోరఖ్ పూర్ రైలులో  ఈ ఘటన చోటు చేసుకుంది.  అర్హంత్ షెల్బీ అనే నెటిజన్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. మహిళా దినోత్సవం రోజున సీట్ల సమస్యపై మహిళల  ఆందోళన పేరుతో  మరో వ్యక్తి కూడ ఈ వీడియోను పోస్టు చేశారు.

also read:అరుదైన గౌరవం:స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హైద్రాబాద్ మెట్రో రైలు విజయగాధ

 ఈ వీడియో పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే వేలాది మంది తిలకించారు. 4 లక్షల మంది ఈ వీడియోను చూశారు. మరో వైపు 2 వేల మంది ఈ వీడియోకు లైక్ కొట్టారు.

also read:వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు లింక్: రిపోర్ట్

 

Kalesh b/w a Mother-Daughter Duo and a Man inside Dehradun to Gorakhpur train over Seat issues on Women's Day
pic.twitter.com/N4Xrcy7hAS

— Ghar Ke Kalesh (@gharkekalesh)

ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  కొందరు తమ వ్యాఖ్యల్లో హ్యాపీ ఉమెన్స్ డే లేడీస్ వంటి కామెంట్స్ చేశారు.  మరికొందరు ఈ ఘటనను మహిళా సాధికారితకు  ప్రతిబింబంగా పేర్కొన్నారు. 

click me!