విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మూగ, బదిర బాలులు..

రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు వినికిడి లోపం, స్పీచ్ డిజెబిలిటీతో బాధపడుతున్నారు. వీరందరి వయస్సు 15 ఏళ్ల లోపే ఉంటుంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.


తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు మూగ, బదిర బాలులు కావడం విచారకరం. ఈ ఘటన చెంగల్పట్టులోని ఉరపాక్కం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మూఢత్వానికి మహిళ బలి.. దెయ్యం విడిపిస్తానని తాంత్రికుడి చిత్రహింసలు.. వివాహిత మృతి

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి.   వినికిడి లోపంతో బాధపడుతున్న 15 ఏళ్ల సురేష్, స్పీచ్ డిజెబిలిటీ ఉన్న 10 ఏళ్ల రవి, 11 ఏళ్ల మంజునాథ్ లు స్నేహితులు. లాంగ్ వీకెండ్ రావడంతో వారు తమ కుటుంబ సభ్యులతో గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారు చెంగల్పట్టు సమీపంలో ఉన్న ఉరపాక్కం గ్రామానికి వెళ్లారు. అయితే ఈ గ్రామానికి సమీపంలో రైలు పట్టాలు ఉంటాయి. 

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. నదిలో పడ్డ కారు.. ఆరుగురి మృతి..

కాగా.. ఈ ముగ్గురు స్నేహితులు మంగళవారం ఆడుకోవడానికి రైలు పట్టాల దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆడుకుంటూ, పట్టాలు దాటేందుకు ఆ ముగ్గురు చిన్నారులు ప్రయత్నించారు. ఇదే సమయంలో బీచ్ స్టేషన్, చెంగల్పట్టు మధ్య నడిచే సబ్ అర్బన్ రైలు ఆ పట్టాలపై ప్రయాణిస్తోంది. ఈ రైలును ముగ్గురు చిన్నారులు గమనించలేదు. 

బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. భర్తను చితకబాది, భార్యపై గ్యాంగ్ రేప్..

దీంతో సురేష్, రవి, మంజునాథ్ లను రైలు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం తెలియడంతో గుడువంచెరి పోలీసులు, రైల్వే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ని ట్రాక్ పై నుంచి మృతదేహాలను వెలికితీశారు. పిల్లల తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 

click me!