
మస్కిటో కాయిల్స్ పొగ పీల్చడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు నిద్రలోనే మరణించారు. ఈ విషాద ఘటన న్యూ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ పొగలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చి వారంతా ఊపిరాడక మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులందరనీ సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే వారంతా మరణించారని డాక్టర్లు తెలిపారు.
ప్రజల నాడి నాకు తెలుసు.. కర్ణాటకలో మళ్లీ బీజేపీదే అధికారం - మాజీ సీఎం యడ్యూరప్ప
ఈ ఘటనపై ఢిల్లీ నార్త్ ఈస్ట్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ‘‘ ఆ కుటుంబ సభ్యులు గురువారం రాత్రి పూట ఇంటి తలుపులు, కిటికీలు మూసి మస్కిటో కాయిల్స్ వెలిగించారు. దీంతో గది మొత్తం పొగలు వ్యాపించాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ పొగ మొత్తం వారు తెలియకుండానే పీల్చుకున్నారు. అందులోనే ఉన్న కార్బన్ మోనాక్సైడ్ ను వారు పీల్చుకొని నిద్రలోనే చనిపోయారు’’ అని పేర్కొన్నారు.
మోడీపై జైరాం రమేష్ విమర్శలు: ఎదురు దాడి చేసిన నెటిజన్లు
ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరుగురు పెద్దలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇలాంటి ఘటనే 15 రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ నెల 15వ తేదీన మహాసముంద్ జిల్లాలోని ఇటుక బట్టీ దగ్గర వెలువడిన పొగ పీల్చి ఐదుగురు కార్మికులు చనిపోయారు. మరో కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వీరంతా ఆ ఇటుకలు చేస్తూ జీవనం సాగిస్తున్నవారే. ఇప్పటిలాగే ఆరోజు కూడా రాత్రి సమయంలో ఆరుగురు కార్మికులు ఇటుక బట్టీలకు మంటపెట్టారు. అనంతరం అక్కడే పడుకున్నారు. అయితే ఉదయం వారంతా చనిపోయారు. పొగను పీల్చడంతో ఊపిరాడక చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు.
కాన్పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం: 500 బట్టల దుకాణాల్లో మంటలు
సమీపంలో ఉండే ఇతర కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని లేపేందుకు ప్రయత్నించారు. అయితే, వారు ఎంతకు లేవకపోవడంతో ప్రమాదం వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఒక కార్మికుడిని ఆస్పత్రిలో చేర్పించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.