మోడీపై జైరాం రమేష్ విమర్శలు: ఎదురు దాడి చేసిన నెటిజన్లు

Published : Mar 31, 2023, 11:24 AM IST
 మోడీపై  జైరాం రమేష్ విమర్శలు:  ఎదురు దాడి  చేసిన నెటిజన్లు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ  కొత్త  పార్లమెంట్  భవన నిర్మాణ పనులపై  మాజీ కేంద్ర మంత్రి  జైరాం రమేష్  చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబట్టారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  కొత్త పార్లమెంట్  భవన నిర్మాణ పనులను  పరిశీలించడంపై  మాజీ కేంద్ర మంత్రి జైరామ్  రమేష్  విమర్శలు చేశారు.  ఈ విమర్శలకు సోషల్ మీడియా వేదికగా  కౌంటర్  ఇచ్చారు.  ప్రజాధరణ కలిగిన  నేతలు కాంగ్రెస్ నేతలకు  నియంతలుగా  కన్పిస్తారని  బీజేపీ  నేతలు  ఎదురుదాడికి దిగారు.

 

మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్  ట్విట్టర్ వేదికగా  చేసిన వ్యాఖ్యలకు  పలువురు నెటిజన్లు  కౌంటర్లు ఇచ్చారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నూతన  పార్లమెంట్  కార్యాలయ భవన నిర్మాణ పనులను నిన్న పరిశీలించారు.  సుమారు గంట పాటు  ప్రధాని  అక్కడే  ఉన్నారు. ఈ విషయమై  మాజీ కేంద్ర మంత్రి  జైరామ్ రమేష్  ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీని  నియంతగా  జైరాం రమేష్ విమర్శించార.  కొత్త పార్లమెంట్ భవనం  వ్యక్తిగత  వానిటీ  ప్రాజెక్టుగా  మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్  వ్యాఖ్యానించారు.

కొత్త  పార్లమెంట్ భవన నిర్మాణ  పనులతో  ప్రజా ధనం వృధా  అని  జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు.  ఈ విషయమై  నెటిజన్లు  మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు కౌంటర్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో   కాంగ్రెస్ పార్టీ నుండి  అతి కొద్దిమంది మాత్రమే కొత్త పార్లమెంట్ భవనంలోకి వస్తారని  నందిని సెటైర్ వేశారు. 

రాహుల్ గాంధీపై  అనర్హత వేటు పై  ఆ పార్టీ నేతలకు బాధగా ఉందని మరో  నెటిజన్ వ్యాఖ్యానించారు.  అయితే  కొత్త పార్లమెంట్ ను  కాంగ్రెస్ ఎంపీలు శాశ్వతంగా  బహిష్కరిస్తారా  అని  విజయ్ అనే నెటిజన్ ప్రశ్నించారు.  బ్రిటీష్  నీడల నుండి  రావడానికి కాంగ్రెస్ నేతలు  ఇంకా  ఇష్టపడడం లేదని  బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి  విమర్శించారు.  

కొత్త పార్లమెంట్  భవనం భావి ప్రధానులకు  ఉపయోగకరంగా  ఉంటుందని  గోకుల్ అనే నెటిజన్ వ్యాఖ్యానించారు. 2026లో డిలిమిటేషన్ కారణంగా ఎంపీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో కొత్త పార్లమెంట్ భవనం అవసరమైందని మరో నెటిజ.న్ వ్యాఖ్యానించారు. 

జైరామ్ రమేష్ వ్యాఖ్యలపై  కర్ణాటకు  చెందిన బీజేపీ నేత  సీటీ రవి  మండిపడ్డారు.  అత్యంత ప్రజాధరణ కలిగిన  నాయకుడు నియంతగా  కాంగ్రెస్ నేతలకు  కన్పిస్తారన్నారు. ఈ బానిసలు  జీవితాంతం  నియంతలను  ఆరాధించడం అలవాటు  చేసుకున్నారన్నారన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌