కర్మ పూజ చేసేందుకు అవసరమైన మట్టి, ఇసుక సేకరించేందుకు చెరువుకు వెళ్లిన పలువురు బాలికల్లో నలుగురు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది.
జార్ఖండ్ లోని గిరిదిహ్ లో విషాదం చోటు చేసుకుంది. పంట పండుగ కర్మ పూజ చేసేందుకు అవసరమైన మట్టి, ఇసుక తీసుకురావడానికి చెరువులోకి దిగిన నలుగురు బాలికలు నీటిలో మునిగి చనిపోయారు. వీరందరి వయస్సు 15 సంవత్సరాల లోపే ఉంటుంది. అయితే వీరితో పాటు నీట మునిగిన ఓ బాలికను స్థానికులు రక్షించారు. ప్రస్తుతం ఆ బాలిక హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.
దారుణం.. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం..
పోలీసులు, ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. జార్ఖండ్ గిరిదిహ్ లో ప్రతీ ఏటా ఈ సమయంలో కర్మ పూజ నిర్వహిస్తారు. అయితే ఈ పూజ చేసేందుకు మట్టి, ఇసుక అవసరం ఉంటుంది. అందుకే హందాదిహ్ గ్రామానికి చెందిన పలువురు బాలికలు పెతియాతాండ్ గ్రామంలో ఉన్న చెరువు వద్దకు మంగళవారం వెళ్లారు. అయితే ఇసుక తీసుకునేందుకు ముందు వారు చెరువులో దిగి స్నానం చేశారు. ఈ క్రమంలో ఓ బాలిక నీటిలో మునిగిపోయింది. అయితే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి ఐదుగురు నీటిలో మునిగిపోయారు.
వారు మునిగిపోవడాన్ని చూసిన అక్కడున్న ఇతర బాలికలు కేకలు వేశారు. ఈ అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక బాలికను రక్షించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాలికను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ బాలిక అక్కడ చికిత్స పొందుతోంది. కానీ మిగితా నలుగురు బాలికను బయటకు తీసేలోపే వారు నీటిలో మునిగిపోయి, ఊపిరాడక మరణించారు. మృతులను మమతా కుమారి (15), దివ్య కుమారి (12), సృష్టి కుమారి (12), సంధ్య కుమారి (14)గా గుర్తించారు.