దారుణం.. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం..

By Asianet News  |  First Published Sep 20, 2023, 1:08 PM IST

ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


యూపీలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కాన్పూర్ దేహత్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అక్బర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ ఐదేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.

రాజ్యాంగ కొత్త ప్రతులలో కనిపించని సోషలిస్ట్, సెక్యులర్ పదాలు.. - ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి ఆందోళన

Latest Videos

అదే గ్రామంలోని సమీపంలోని ఇంట్లో ఓ ఏడేళ్ల బాలుడు కూడా నివసిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి సమయంలో ఆ బాలిక ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. దీనిని అదునుగా భావించిన ఆ బాలుడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తల్లి గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రూ.3 వేల బాకీ కట్టలేదని.. కూరగాయల వ్యాపారిని చితకబాది, నగ్నంగా ఊరేగించిన దుండగులు.. వీడియో వైరల్

బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అనంతరం పిల్లలిద్దరినీ పోలీసులు జిల్లా హాస్పిటల్ కు తరలించగా వైద్య నివేదికలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై అక్బర్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సతీష్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కేసును పోలీసులు జాగ్రత్తగా విచారిస్తున్నారని తెలిపారు.

పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వితంతువుపై 14 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం..

‘‘ఏడేళ్ల లోపు పిల్లలు నేరం చేస్తే అది నేరం కిందకు రాదు. అయితే ఈ కేసులో న్యాయ సలహా తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని సతీష్ సింగ్ తెలిపారు.

click me!