విషాదం.. ఇసుకలో జారిపడి, ట్రాక్టర్ చక్రాల కింద నలిగి నాలుగేళ్ల బాలుడు మృతి

By Asianet News  |  First Published Jun 8, 2023, 6:50 AM IST

ఇసుకలో జారి పడి ట్రాక్టర్ చక్రాల కింద నలిగి ఓ నాలుగేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 


కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్లిన ఓ బాలుడు ఇసుక కుప్ప వద్ద జారి పడ్డాడు. అయితే ఇది గమనించకుండా అటు వైపు నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో టైర్లు బాలుడి మీది నుంచి వెళ్లాయి. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన దృష్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

కర్ణాటకలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న మాజీ మిత్రుడు..

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం బన్నెరఘట్ట ప్రాంతంలోని ఇరుకైన మార్గంలో నాలుగేళ్ల బాలుడు భువన్ తో పాటు మరో బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం ఇరుకుగా ఉంటుంది. వాహనాల రాకపోకలకు అనువుగా ఉండదు. బాలుడు నడుచుకుంటూ వెళ్తూ.. రోడ్డుపై పోసిన ఓ ఇసుక కుప్పను దాటబోయారు. అదే సమయంలో వారికి ఎదురుగా వాటర్ ట్యాంకర్ తో ఉన్న ట్రాక్టర్ వస్తోంది.

దళిత విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారం.. నెలల తరబడి అఘాయిత్యం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

పిల్లలు, ఆ ట్రాక్టర్ ఒకే సారి ఇసుకను దాటుతున్నారు. అయితే ట్రాక్టర్ ఇంజన్ పిల్లలను దాటుకొని వెళ్లిపోయింది. ఇదే సమయంలో భువన్ ఇసుక కుప్పలో జారి కింద పడిపోయాడు. అయితే ఈ విషయాన్ని గమనించని ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. దీంతో ట్రాక్టర్ వెనక చక్రాలు బాలుడిపై నుంచే వెళ్లిపోయాయి. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు.

చనిపోయాడని భావించి మృతదేహాల గదికి.. కాపాడిన తండ్రి.. ఒడిశా ప్రమాదంలో వెలుగులోకి మరో ధీన గాథ

ఇరుకైన మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న భువన్ ఇసుకపై జారిపడి వాటర్ ట్యాంకర్ వెనుక చక్రం కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కాగా.. ఐపీసీ సెక్షన్ 279, 304ఏ, మోటారు వాహనాల చట్టం 134 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

click me!