ఆ విషయంలో ఇంకా మౌనం ఎందుకు..ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఆగ్రహం

By Rajesh Karampoori  |  First Published Jun 8, 2023, 5:24 AM IST

మణిపూర్‌ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని, సయోధ్య కోసం విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించడం లేదని కాంగ్రెస్  ప్రశ్నించింది. మణిపూర్‌లో పర్యటించాల్సిందిగా అఖిలపక్ష బృందాన్ని ప్రధాని ఎందుకు ప్రోత్సహించడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు.


మణిపూర్‌ హింసాత్మక సంఘటనలపై కాంగ్రెస్  ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంది. ఈ హింసాత్మక వా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, రాష్ట్రంలో పర్యటించి వర్గాల మధ్య సయోధ్య కోసం ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. మణిపూర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపేందుకు ప్రధాని ఎందుకు చొరవ తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు.

మణిపూర్‌లో ఏడు వారాల క్రితం మొదలైన భయంకరమైన విషాదం ఇంకా ముగిసిపోలేదని అనిపిస్తోందని కేంద్రంపై విరుచుకుపడ్డాడు. ఒక నెల ఆలస్యం తర్వాత హోంమంత్రి రాష్ట్రాన్ని సందర్శించారు, ఈ దయకు దేశం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, కానీ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 

Latest Videos

ప్రధాని మోదీని టార్గెట్  

మణిపూర్‌లో పర్యటించి సయోధ్య కోసం ప్రధాని ఎందుకు విజ్ఞప్తి చేయరని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. మణిపూర్‌లో పర్యటించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఎందుకు ప్రోత్సహించడం లేదు. ఇదిలా ఉండగా బుధవారం మణిపూర్‌లో అపహరించిన ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడానికి భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. శాంతి, సామరస్యం కోసం ఇలాంటి ఆయుధాలను భద్రతా బలగాలకు అప్పగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 కొనసాగుతోన్న హింసాత్మక ఘటనలు

మణిపూర్‌కు సంబంధించి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ శాంతి స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందనీ, ఆపై మేము సంఘాల డిమాండ్లను విని అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  మణిపూర్‌లో షెడ్యూల్డ్ తెగ (ఎస్‌టి) హోదా కల్పించాలనే మీతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా మే 3న గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించబడిన తర్వాత హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 100 మంది చనిపోయారు. మే 3 నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. వార్తా సంస్థ PTI ప్రకారం.. ఆదివారం నాడు  పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ఒక గుంపు అంబులెన్స్‌ను ఆపి తగులబెట్టింది. దీంతో ఎనిమిదేళ్ల చిన్నారి, తల్లి, మరో బంధువు మృతి చెందారు.

click me!