ఈ రోజు టాప్ టెన్ వార్తలు
కొత్తగా 10 వందే భారత్ రైళ్లు
దేశంలోని పలు రాష్ట్రాల్లో 10 వందే భారత్ కొత్త రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ప్రారంభించారు.గుజరాత్ రాష్ట్రంలోని అహ్మాదాబాద్ ఇవాళ మోడీ పర్యటించారు. అహ్మాదాబాద్ నుండి మోడీ వర్చువల్ గా ఈ రైళ్లను ప్రారంభించారు. పూర్తి కథనం
కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు?
తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మంగళవారంనాడు ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది. పూర్తి కథనం
యాదాద్రి ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి
దళితుడైనందునే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను చిన్న పీట మీద కూర్చోబెట్టారని వస్తున్న విమర్శలపై భట్టి స్పందించారు. తానే కావాలని చిన్నపీట మీద కూర్చున్నానని వివరించారు. పూర్తి కథనం
41 రోజుల్లో 24 రాష్ట్రాలు.. మోడీ సుడిగాలి పర్యటన
గత నెల ప్రారంభం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలను సందర్శిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇలా 41 రోజుల్లో 24 రాష్ట్రాలను ఆయన సందర్శించారు. పూర్తి కథనం
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీ
హర్యానా సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నాయబ్ సైనీని అధిష్టానం ఎంపిక చేసింది. నేటి సాయంత్రం 5 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి కథనం
మహాత్మా గాంధీ ఆశ్రమం అప్పుడు.. ఇప్పుడు!
మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే ఆ ఆశ్రమ పాత చిత్రాలు, కొత్త చిత్రాలు వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం
టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి విరాట్ కోహ్లీ ఔట్
టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్-ఏ లో పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడాలతో పాటు భారత్ ఉంది. జూన్ 5న ఐర్లాండ్ తో మెన్ ఇన్ బ్లూ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, కింగ్ కోహ్లీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాట్లో టాక్ నడుస్తోంది. పూర్తి కథనం
ఐసీసీ అవార్డు అందుకున్న యశస్వి జైస్వాల్
కేన్ విలియమ్సన్, పాతుమ్ నిస్సాంక వంటి స్టార్ ప్లేయర్లను వెనక్కినెట్టి టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. ఇటీవల భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో 2 డబుల్ సెంచరీలు బాదిన జైస్వాల్ ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పూర్తి కథనం
అంతా ధనుష్ చేశాడు, నాదేం లేదు: ఐశ్వర్య
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా తన మాజీ భర్త ..తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం
యాంకరింగ్ మానేసిన ప్రదీప్ ఏం చేస్తున్నాడో తెలుసా?
ప్రదీప్ మాచిరాజు స్టార్ యాంకర్. చాలా కాలంగా బుల్లితెరపై ఆయన హవా నడుస్తోంది. సడన్ గా యాంకరింగ్ మానేసిన ప్రదీప్ మాచిరాజు ఏం చేస్తున్నాడో ఓ వీడియోతో వెలుగులోకి వచ్చింది. పూర్తి కథనం