Presidential Election 2022 : నేడే రాష్ట్రపతి ఎన్నిక..

Published : Jul 18, 2022, 07:10 AM IST
Presidential Election 2022 : నేడే రాష్ట్రపతి ఎన్నిక..

సారాంశం

రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. నేటి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

న్యూఢిల్లీ :  దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.  నాలుగు వేల ఎనిమిది వందల మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు  సోమవారం ఓటు వేయనున్నారు.  ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో,  రాష్ట్రాల్లోని  అసెంబ్లీలో  ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది.  బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే  రాష్ట్రాలకు  తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది.  ఈనెల 21న పార్లమెంట్ హౌస్ లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.  ఎన్ డి ఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము,  విపక్షాల నుంచి  యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించేలా కనిపిస్తున్నారు.  మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పైచిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి.  దీంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళ రికార్డు సృష్టించనున్నారు.  అంతేగాక ప్రతిభాపాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు రెండు మహిళా అవుతారు ముర్ము.  రాష్ట్రపతి ని ఎందుకు ఎలక్టోరల్ కాలేజిలో.. ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైస్ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది.  నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు.

 సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు.  కాబట్టి ఓటింగ్కు అవకాశం ఉంటుంది.  జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ  లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700 తగ్గింది.  ఇక ఎమ్మెల్యేలు ఓటు విలువలో 208 తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.  176 తో jharkhand,  తమిళనాడు రెండో స్థానంలో,  175 తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి.  ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7 గా ఉంది.

ఒకప్పుడు మీ పార్టీ వాడినే.. మీకిదే చివరి అవకాశం: బీజేపీ నేతలకు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అప్పీల్

ఇదిలా ఉండగా,  ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బీజేపీ నేతలకు సరికొత్త విధానంలో అప్పీలు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాలని బీజేపీ నేతలను కోరారు. తద్వారా బిజెపి రక్షించుకోవచ్చు అని వివరించారు. బీజేపీని రక్షించడానికి వారి చేతిలో ఉన్న చివరి అవకాశం అని పేర్కొన్నారు. తనను గెలిపించడం ద్వారా దేశాన్ని రక్షించిన వారు అవుతారని తెలిపారు. అదేవిధంగా ఎన్ డీఏ ఈ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై విమర్శలు సంధించారు.  ఆమె రబ్బర్స్టాంప్ వంటివారిని,  మౌనమే ఆమె విధానం అని విమర్శించారు.  ఆమె దేశ రాజ్యాంగాన్ని రక్షిస్తుందా?  లేక ప్రధానమంత్రిని రక్షిస్తుందా? అని ఓ లేఖ విడుదల చేశారు.  

దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులు పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేయాలని అప్పీల్ చేశారు. దేశాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి,  లౌకికత్వాన్ని రక్షించడానికి తనకు ఓటు వేయాలని కోరారు. ప్రత్యేకంగా బీజేపీ నేతలకు ఆయన  ఒక అప్పీలు చేశారు. ఒకప్పుడు బిజెపికి చెందిన వాడినే అని గుర్తుచేసుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ సారధ్యంలో ఉన్న పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని.. అలాంటి వాతావరణం ఇప్పుడు బిజెపిలో లేదని స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పడానికి బాధపడుతున్నారని వివరించారు. ప్రస్తుత ఏక నాయకుడు సారధ్యంలో ఉన్న బిజెపి దిగజారిపోయింది అని పేర్కొన్నారు. అప్పటి పార్టీకి, ఇప్పటి పార్టీకి మధ్య గల తేడాను స్పష్టంగా గ్రహించే ఉంటారు అని చెప్పుకొచ్చారు.  కాబట్టి,  బీజేపీ లో మంచి మార్పు తీసుకు రావడానికి ఇదే సరైన ఇదే సరైన సమయం అని, ఇదే చివరి అవకాశం అని వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..